రాయపోల్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1988-89వ, పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.

Jul 3, 2025 - 09:21
Jul 3, 2025 - 18:53
 0  3
రాయపోల్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1988-89వ, పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.

ఇబ్రహీంపట్నం: 03 జూలై 2025 (గురువారం) తెలంగాణ వార్త రిపోర్టర్:- ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని చింతపల్లి గూడ అంతర రిసార్ట్స్ అండ్ బ్యాంకెట్స్ లో రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1988-89వ, పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.రాయపోల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఆనాటి గురువులు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఉపాధ్యాయులు మాట్లాడుతూ...గురువుల పైన సామాజిక బాధ్యత ఎంతగానో ఉంది. గురువుల యొక్క ప్రతి కదిలిక సమాజం గమనిస్తూ ఉంటుంది.గురువులు సత్పవర్తన కలిగి ఉంటేనే విద్యార్థులకు మంచి విషయాలు బోధించగలుగుతారన్నారు.36 సంవత్సరాల తర్వాత తమతో పాటు కలిసి చదువుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకే వేదికలో కలవడం తమకు చాలా సంతోషంగా ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా తమకు విద్య బుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండడానికి కృషిచేసిన ఉపాధ్యాయులు లూట్ దియా,ప్రకాష్,సత్యనారాయణ రెడ్డి,అంజి రెడ్డి,ఇంద్ర సేన రెడ్డి లను సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయపోల్ ఎస్ ఎస్ సి బ్యాచ్ 1988-1989 కి సంబంధించిన 52 మంది విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.