రాజోలి పాఠశాల ఉత్తమ విద్యార్థికి ఘనంగా సన్మానించిన జడ్పీ జిల్లా కో ఆప్షన్ మాజీ సభ్యులు యండీ నిషాక్
జోగులాంబ గద్వాల 26 జనవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి.
రాజోలి మండల కేంద్రంలో రాజోలి జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుతున్న కాటగారి జ్ఞానచరణ్ గత నెల దాదాపు 29 రోజుల క్రిందట వైజ్ఞాన ప్రదర్శన ముగింపు ప్రదర్శన జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీ కార్యక్రమంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫ్లడ్ రెసిస్టెన్స్ హౌస్ అంటే వరదలకు కూడా తట్టుకొని నిలబడే ఇంటి నమూనా రూపంలో తయారు చేయడం జరిగింది అట్టి నమూనా జోగులాంబ గద్వాల జిల్లాలో ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడంతో జిల్లాస్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులు గుర్తించి ప్రశంస పత్రంలో పాటు మెమొంటో ఇవ్వడం జరిగింది అందుకు ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా స్థానిక మండల గ్రామమైన జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ కో ఆప్షన్ మాజీ సభ్యులు యండీ నిషాక్ ఆ విద్యార్థి గురించి తెలుసుకొని ఆ పాఠశాలకు పెళ్లి ప్రధాన ఉపాధ్యాయులు భగీరథ రెడ్డి, మరియు అధ్యాపకుల ఆధ్వర్యంలో వేదిక మీదికీ జ్ఞానచరణ్ పిలిపించి మునుముందు ఇంకా భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర మరియు జాతీయస్థాయి అవార్డులను పొందాలని తెలియజేస్తూ తన వంతు సంతోషంగా మిగతా విద్యార్థులకు కూడా ఉత్సాహ పరిచే విధంగా జ్ఞానచరణ్ కు శాలువాతో సన్మానిస్తూ కొంత ఆర్థిక రూపంలో బహుమతిగా ఇవ్వడం జరిగింది.
తదుపరి కార్యక్రమంలో మాజీ జిల్లా కో ఆప్షన్ సభ్యులు నిషాక్ మాట్లాడుతూ గురువే దైవంగా భావించే విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతో మంచి జీవన విధానం ఉంటుందని అలాంటి వారికి మంచి విజ్ఞానం ఉండటంతో వారి యొక్క తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా తయారవుతారని ప్రతి విద్యార్థులు చాలా చక్కగా చదువుకొని మంచి ఉద్యోగస్తులుగా తయారు కావాలని మండల కేంద్రమైన రాజోలి గ్రామం యొక్క మంచి పేరు తేవాలని సూచిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు,విద్యార్థులకు, గ్రామస్తులకు, ప్రజా ప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఎంఈఓ భగీరథ రెడ్డి, అధ్యాపకులు,ఎన్ వి ఫౌండేషన్ కోఆర్డినేటర్ కాకే సుధాకర్, సీఆర్పీ అల్వాల శాంతయ్య, విద్యార్థులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది
కాటగారి జ్ఞానచరణ్
తల్లిదండ్రులు:-వీరేష్,హరిత
Class 8th B/S ఇంగ్లీష్ మీడియం
డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫ్లడ్ రెసిస్టెన్స్ హౌస్*రాజోలి జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల
జోగులాంబ గద్వాల జిల్లా