రక్తదానం. ప్రాణదానంతో సమానం

రక్తదానం ప్రాణదానం తో సమానం
మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ప్రతిభ బ్లూమ్స్ ఇన్నేటివ్ హై స్కూల్ ఆధ్వర్యంలో రక్తదానం అభినందనీయం... ఎంఈఓ సలీం షరీఫ్, మౌలానా అబ్దుల్ ఖాద్రి రషాదీ అన్నారు.
రక్తదానం ప్రాణదానంతో సమానమని కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్, కోదాడ పెద్ద మసీదు పేషీమామ్ అబ్దుల్ ఖాద్రీ రషాధి లు అన్నారు.
ఆదివారం కోదాడ పట్టణంలో ప్రతిభ బ్లూమ్స్ ఇన్నేటివ్ హై స్కూల్ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినమును పురస్కరించుకొని నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని వారుప్రారంభించి మాట్లాడారు.
రక్తదానం చేస్తే ఎటువంటి అనారోగ్యం కలగదని రక్తదానం ఆరోగ్యంతో పాటు పుణ్య కార్యం అన్నారు. ఆపదలో ఉన్నవారికి రక్తం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రక్తదాన శిబిరం నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.
ఈ సందర్భంగా 30 మంది యువకులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ షేర్ అలీ ముఫ్తి అతహర్ ఖాష్మి, హమీద్ మౌలానా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు షేక్ బాజన్ జహీర్ బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ తదితరులు ఉన్నారు.