యువత స్వశక్తితో ఎదగాలి
సూర్యాపేట టౌన్:- యువత స్వశక్తితో ఎదగాలని మాజీ మంత్రి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు రాoరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కుడ కుడ రోడ్లో ఏర్పాటుచేసిన వైఎస్ ఇంజనీరింగ్ వర్క్స్ షాపును ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువత అవకాశాలను అందిపుచ్చుకొని తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలే కావాలంటూ ఎదురు చూడకుండా తనలో ఉన్న నైపుణ్యాన్ని వెలుగుతీస్తూ నచ్చిన రంగాల్లో యువత ముందడుగు వేయడం అభినందనీయం అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం వ్యాపార కూడలిగా మార్పు చెందుతుందని అనేక అవకాశాలు జిల్లా కేంద్రంలో లభిస్తున్నాయని తెలిపారు. ఇంజనీరింగ్ వర్క్స్ లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వినియోగదారుల మనల్ని పొందాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేనారెడ్డి, కౌన్సిలర్ వేములకొండ పద్మ , వైఎస్ ఇంజనీరింగ్ వర్క్స్ నిర్వాహకులు హరీష్ ,నాయకులు తన్వీర్, నాగరాజు, నగేష్ పాల్గొన్నారు