యస్.సి స్టడీ సర్కిల్, హైదరాబాద్ UPSC ఉచిత కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలి
సూర్యాపేట 18 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- టి.జీ యస్.సి స్టడీ సర్కిల్, హైదరాబాద్ ద్వారా శిక్షణ పొంది ఐఏఎస్, ఐపియస్, ఐఎఫ్ యస్, గ్రూప్-1 వంటి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల విజయ గాధ లతో రూపొందించిన బుక్ లెట్ ను సూర్యాపేట జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నంద్ లాల్ పవార్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నందు ఆవిష్కరించినారు. అర్హులైన సూర్యాపేట జిల్లా నిరుద్యోగ అభ్యర్థుల నుండి 10 నెలల యు.పి.యస్.సి ఉచిత కోచింగ్ కొరకు తేది: 19.07.2026 వరకు ఆన్ లైన్ లో https://tsstudycircle.co.in వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా స్టడీ సర్కిల్ గౌరవ డైరెక్టర్ టి. నాగయ్య పాల్గొన్నారు. మరిన్ని వివరములకు ఫోన్ నం : 9701775868 లో సంప్రదించగలరు.