మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడాలి మున్సిపల్ చైర్మన్
తిరుమలగిరి 26 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
మొక్కల పెంపుతో పర్యావరణం పరిరక్షించవచ్చునని మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి అన్నారు.సోమవారం మున్సిపాలిటీ కేంద్రంలోని 1వ మరియు 10వ వార్డులో వనమోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన మహోత్సవంలో ప్రజలందరూ యజ్ఞం లాగా పాల్గొనాలని కోరారు.గ్రామాలలో, వార్డులలో విరివిరిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. మొక్కలే చెట్లుగా మారి స్వచ్ఛమైన గాలులు అందిస్తాయని,వీటి ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకట్ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఏమోజు గోవిందమ్మ రవీందర్ ,మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకన్న ,మున్సిపల్ కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు,మున్సిపాలిటీ అధికారులు మున్సిపల్ సిబ్బంది వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.