మెగా ఆర్గానిక్ మేళను ప్రారంభించిన""మంత్రి తుమ్మల నాగేశ్వరావు

తెలంగాణ వార్త ప్రతిదీ ఖమ్మం : ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి -సేంద్రియ సాగును, జ్యూట్ బ్యాగులు ప్రోత్సహించాలి -మెగా ఆర్గానిక్ మేళాను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుఆరోగ్యం పట్ల ప్రజలు శ్రద్ధవహించాలని , జ్యూట్ బ్యాగుల వాడకం ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయని దాని వల్ల అనారోగ్యాల భారీనపడుతున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఖమ్మం నగరంలోని టిడిపి ఆఫీస్ పక్కన గల సమీకృత కూరగాయల మార్కెట్ ఆవరణలో గ్రామ భారతి, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఆర్గానిక్ మేళాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని, జ్యూట్ బ్యాగులను ప్రోత్స ఉంచాలని తెలిపారు. రసాయనాలు ఎక్కువగా వినియోగించిన ఆహార పంటలను తినడం వల్ల అనారోగ్యాల భారీనపడుతున్నారన్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు ప్రజలు గురవుతున్నారన్నారు. జంక్, ఫాస్ట్ ఫుడ్లకు బదులు సేంద్రియ పద్దతిలో ఎటువంటి రసాయనాలు వాడకుండా పండించిన పంటలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చునని మంత్రి తెలిపారు. మన పూర్వీకులు మనం తినే ఆహార పదార్థాలను ఇంటి పేరట్లోనో, చేలల్లోనో పండించుకుని తినే వారని అందువల్లనే ఆరోగ్యంగా ఉండేవారని మంత్రి తెలిపారు. ఇప్పుడు ప్రజలు కూడా అవిధంగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన ఆహార పంటలను వినియోగించాలని తెలిపారు. ప్రభుత్వం తరుపున కూడా సేంద్రియ సాగును, జ్యూట్ బ్యాగులు ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆర్గానిక్ మేళాను ఏర్పాటు చేసిన నిర్వహకులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లమల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత నెలలో నిర్వహించిన ఆర్గానిక్ మేళాకు అపూర్వ స్పందన లభించిందని ఆయన తెలిపారు. వినియోగదారుల స్పందన మేరకు ప్రతి నెల రెండవ శనివారం, ఆదివారం ఆర్గానిక్ మేళాను గ్రామభారతి, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేళాలో సేంద్రియ పద్ధతిలో సాగు చేసి పండించిన కూరగాయలు, పండ్లు, చిరు ధాన్యాలు, దంపుడు బియ్యం, దేశవాళి ఆవు నెయ్యి, గానుగ నూనెలు, వనమూలికల పొడులు, పసుపు, బెల్లం, తేనె, చేనేత వస్త్రాలు, జూట్ బ్యాగులు వంటివి లభిస్తాయని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆదివారం కూడా ఆర్గానిక్ మేళా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం సేంద్రియ పద్దతిలో సాగు చేసిన పంటలను ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు మిక్కిలినేని -మంజుల నరేందర్, చావా నారాయణరావు, ఏఎంసి ఛైర్మన్ యరగర్ల హన్మంతరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గ్రామభారతి బాధ్యులు కుతుంబాక మాధవి, నాగేశ్వరరావు, నరేంద్ర స్వరూప్, సేంద్రియ రైతులు తదితరులు పాల్గొన్నారు.