మూతబడిన ప్రభుత్వ బడులను తెరిపించాలి

Jun 1, 2024 - 17:57
 0  9
మూతబడిన ప్రభుత్వ బడులను తెరిపించాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ బడిబాటలో మూతబడిన ప్రభుత్వ బడులను తెరిపించాలి సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక డిమాండ్... ఆత్మకూర్ ఎస్... కొన్ని గ్రామాల ఆవాసాలలో బడి మూతపడి చోట పిల్లలను చదివించుకోవడం తల్లిదండ్రులకు తలకు మించిన భారం గా మారిందని జూన్ 3 నుండి జరగబోయే బడిబాట కార్యక్రమంలో మూత బడిన ప్రభుత్వ బడులను తెరిపించుటకు ఉపాధ్యాయులను వెంటనే కేటాయించాలని సూర్యాపేట సామాజిక అధ్యాయన్వేదిక కన్వీనర్ న్యాయవాది లింగంపల్లి భద్రయ్య అన్నారు. శనివారం ఆత్మకూర్ ఎస్ మండలంలో లోని బడి మూతబడిన ఆవాసమైన మంగలి తండ గ్రామ పంచాయతీ అవాసo భోజ్య తండా ప్రజల వద్దకు వెళ్లి, వారి అభిప్రాయాలను సేకరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ,ప్రజలందరూముక్త కంఠంతో ప్రభుత్వ బడి గ్రామంలో ఉండాలని అభిప్రాయాన్ని వ్యక్తం పరిచారు అన్నారు.వేదిక కో కన్వీనర్ రేపాక లింగయ్య మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు ఎనభై పాఠశాలలు మూసివేయబడి ఉన్నాయని ఆత్మకూర్ ఎస్ మండలం లోనే భోజగాని(మంగలి) తండా,జగిణితండా,అస్లా తండా,కిష్టసముద్రం అనే ఆవాసాలలో నాలుగు ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి అన్నారు.ఈ పాఠశాలలను అన్నిటినీ తెరిపించి పేదలకు విద్యను అందుబాటులో ఉంచాలి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులనితిని కల్పించి, సరిపోవు ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన విద్యను అందించాలి అన్నారు. అదే విధంగా పర్యవేక్షణ అధికారుల పోస్టులను అన్నిటినీ యుద్ధ ప్రాతిపాదికన నియమించి పాఠశాలలపై పర్యవేక్షణ పెంచాలి అన్నారు.ఈ కార్యక్రమంలో చామకూరి నర్సయ్య, నారబోయిన. వెంకట్ యాదవ్,జి. కోటయ్య,ఆవుల.నాగరాజు, నాగేందర్ నాయక్, మాధవ రెడ్డి, యోగానంద, ఆనంద భాస్కర్, క్రాంతికుమార్, పాతులోతు వెంకన్న ,రాజ శేకర్,నకిరేకంటి. వెంకన్న,అంబేద్కర్,చిరంజీవి , దీకొండ వెంకటేశ్వర్లు. ఆయా గ్రామస్తులు పాల్గొన్నారు.