మూడు నెలల పాప మృతి చెందిన ఘటనపై జిల్లా వైద్యాధికారి క్షేత్రస్థాయిలో విచారణ.
జోగులాంబ గద్వాల 22 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. పరిధిలోని చనుగొనిపల్లి లోని హరీష్ శ్రావణి దంపతులకు మూడు నెలల పాప అనారోగ్యంతో ఉండడంతో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సలు నిర్వహించగా వైద్యుల నిర్లక్ష్యం మూలంగా శుక్రవారం మృతి చెందిన ఘటనపై ఆందోళన చెందడంతో న్యూస్ రావడంతో జిల్లా వైద్యాధికారి కిరణ్ మై సంధ్య శనివారం 12 గంటల సమయంలో సౌమ్య చిల్డ్రన్ ఆసుపత్రిని ప్రైవేటు సందర్శించి పలు విషయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రిలోని రికార్డులను స్వాధీనం చేసుకొని. పాపకు అందించిన చికిత్సల నిర్వహణపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బెడ్షీట్లు. ఆక్సిజన్ అందుబాటులో ఇవ్వకపోవడం. పరిసరాలు. మెడికల్ షాప్ లోని మందులను పరిశీలించారు. మూడు నెలల పాపకి చికిత్సలేలా అందజేశారని దానిపై పూర్తిస్థాయిలో పరిశీలించారు. వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. వెంటిలేటర్లు. సిబ్బంది పనితీరు తదితర వంటి విషయాలను పరిశీలించి అసంతృప్తిని వ్యక్తపరిచారు. ఈ పర్యవేక్షణలో ప్రోగ్రాం ఆఫీసర్ ప్రణతిరాని. డాక్టర్ రాజు సీఏ సెక్షన్ నరసన్న తదితరులు పాల్గొన్నారు.