ముర్రు పాలు బిడ్డకు సంజీవిని

Aug 1, 2026 - 21:41
 0  2
ముర్రు పాలు బిడ్డకు సంజీవిని

తిరుమలగిరి 02 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

  తిరుమలగిరి మండలం జలాల్పురం లౌక్య తండాలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించి బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్ హీరోని మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. పుట్టిన వెంటనే శిశువుకు ముర్రుపాలు పట్టించడం ఎంతో అవసరమన్నారు. పుట్టిన తొలి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ఆమె సూచించారు. తల్లి పాలలో శిశువు ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు ఉండటంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి