మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి నర్సింలు కి మున్సిపల్ కమిషనర్ కి.

Sep 10, 2026 - 18:32
 0  6
మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి నర్సింలు కి మున్సిపల్ కమిషనర్ కి.

మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి నర్సింలు కి మున్సిపల్ కమిషనర్ కి.

జోగులాంబ గద్వాల 10 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా కేంద్రం నందు గద్వాల పట్టణంలో 21 వార్డులో నల్లకుంట లో కుక్కల గుంపులతో బైకుపై వస్తున్న కార్పెంటర్ వీరన్న చారి .బండిపై వస్తుంటే కుక్కలు వెంబడించి బండిపై దాడి చేయడం వలన బండి కింద పడి వీరన్న భుజం పైన ఎముక విరగడము జరిగినది ముఖంపై గాయాలు అయినవి గతంలో ఎన్నోసార్లు కూడా కుక్కల దాడి వలన గాయపడిన బాటసారులు ఎంతోమంది ఉన్నారు. గత మూడు నెలల నుండి కౌన్సిల్ సమావేశంలో ప్రతిసారి కుక్కలపై చర్చ జరగడం కంప్లీట్ చేయడం జరుగుతున్నది కానీ మున్సిపల్ అధికారులు ఏమాత్రం చొరవ చూపడం లేదు.  కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి వదులుతున్నాము అని అనడం జరుగుతున్నది కుక్కలకు ఆపరేషన్ చేసే సెంటర్ కూడా నల్లకుంట లో ఉన్నది అట్టి ఆపరేషన్ చేసిన కుక్కలను అడవుల్లో వదలకుండగా నల్లకుంటలో.నడిబొడ్డున వదలడం జరుగుతున్నది. ఈ విషయం ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన. ఒక జోకులా తీసుకోవడం జరుగుతున్నది.

కుక్కలకు రక్షణ మనమే కల్పిస్తున్నాం కానీ ప్రజలకు మాత్రం రక్షణ లేకుండా పోయింది కుక్కల నుంచి ప్రజాప్రతినిధులుగా మనము కాపాడవలసిన ప్రజలను రక్షించుకోలేని పరిస్థితుల్లో ఈ గద్వాల మున్సిపాలిటీ ఈ విధంగా తయారయిందని ప్రజల నుంచి విమర్శనలను మొదలవుతున్నాయి. మున్సిపల్ కమిషనర్ అధికారులు తక్షణమే నల్లకుంటలో ఉన్న కుక్కలను పట్టుకొని అడవుల వదిలి పెట్టే విధంగా చూడాలని ప్రజలు నన్ను అనగా కౌన్సిలర్ గా నన్ను కోరడం జరిగినది ప్రజలు. 21 వార్డు ప్రజలు నా దృష్టికి తీసుకు రావడం జరిగినది కాబట్టి. నేను ఈ విధంగా పత్రికా ప్రకటన రూపకంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే గత కౌన్సిల్లో సమావేశంలో ఎన్నోసార్లు మీ దృష్టికి తీసుకురావడం  జరిగినది. కానీ మీ నుంచి ఎలాంటి స్పందన లేదు కాబట్టి మరోసారి. ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను. లేదంటే ఒక్కసారి మున్సిపల్ కమిషనర్ గారు కానీ మున్సిపల్ అధికారులు కానీ రాత్రిపూట నల్లకుంట కి మీరు బైక్ పైన గానీ లేదా పాదరక్షకుగా గాని నల్లకుంట కి రాత్రిపూట రండి మీకు ఏ విధంగా కుక్కల నుంచి రక్షించుకుంటారో మీకే అర్థమవుతుంది.  కుక్కల నుంచి నల్లకుంట ప్రజలను కాపాడుతారని ఆకాంక్షిస్తూ. మీ  పులిపాటి వెంకటేష్. 21.వార్డు కౌన్సిలర్. వారు ఉన్నతదికలను కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333