ముగిసిన ఎన్నికల కోడ్ 

పరుగులు తీయనున్న పాలన 

Jun 9, 2024 - 19:59
Jun 9, 2024 - 20:10
 0  44
ముగిసిన ఎన్నికల కోడ్ 

పాతుకుపోయిన అధికారుల బదిలీలు 

సంక్షేమం -అభివృద్ధి జోడెడ్లుగా సాగాలని సర్కారు నిర్ణయం 

అధికారుల పనితీరుపై ప్రతి నెలా నివేదికలు, సమీక్షలు

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెను వెంటనే ఆరుగారంటీల అమలుపై దృష్టి పెట్టింది. ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచుతూ అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగించుకునే వారికి జీరో బిల్లు మంజూరును అమల్లోకి తెచ్చారు. హామీ ఇవ్వక పోయినప్పటికీ డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాల బకాయిలను మంజూరు చేశారు.

 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేశారు. ఈ క్రమంలోనే లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఒకసారి గా పాలనకు బ్రేక్ పడింది. పాలనలో కొంత స్తబ్దత ఏర్పడింది. కోడ్ ముగిసిన వెంటనే ఈ నెల 9 నుంచి పాలనను పరుగులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లు ప్రణాళికలు రూపొందించారు. వరుస సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలకు రంగం సిద్ధం చేశారు. ఈ నెలాఖరులోగా రాష్ట్రంలో పాతుకుపోయిన అధికారులు, ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు. మూడేళ్లకు పైగా ఒకే చోట పాతుకుపోయిన అధికారులందరినీ కదిలించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈనెల 9న ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలకు కార్యాచరణ ప్రారంభమైంది, ఈనెల చివరకు ఈ ప్రక్రియ ముగియనుంది. సంక్షేమం- అభివృద్ధి జోడేడ్ల తరహాలో రాష్ట్రంలో పాలన ముందుకు సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లు నిర్ణయించినట్లు తెలిసింది. ప్రజాపాలన అందించడం లో అధికారుల భాధ్యత తీవ్రంగా ఉంటుంది. అధికారుల పనితీరుపై ప్రతి నెలా నివేదికలు తెప్పించుకొని సమీక్షలు నిర్వహించాలని, అశ్రద్ద వహించే అధికారులను పక్కకు పెట్టాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333