ముందు తరాల కోసం చెట్లను నాటాలి మున్సిపల్ చైర్మన్

Aug 3, 2026 - 21:39
Aug 3, 2026 - 23:21
 0  4
ముందు తరాల కోసం చెట్లను నాటాలి మున్సిపల్ చైర్మన్

  తిరుమలగిరి 04 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:-  వన మహోత్సవం సందర్భంగా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని కూరగాయల సంతలో మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ చెట్లే మనకు ఊపిరి, చెట్లుంటేనే వర్షాలు, చల్లదనం అని, మన తర్వాతి తరాల కోసం మొక్కలు నాటాలని వారు సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని వారు కోరారు.. ఈ కార్యక్రమంలో... మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఎల్సోజు గోవిందమ్మ, కమిషనర్ సిహెచ్ వెంకన్న, ఎస్సై వెంకట్ రెడ్డి వార్డ్ కౌన్సిలర్స్ పనికరా లక్ష్మి, జక్కుల రమేష్, కారుపోతుల సోమలక్ష్మి నరేష్, బత్తుల శ్రీను, కందుకూరి గీత బాబు, సంకేపల్లి జ్యోతి నరోత్తం, పత్తేపురం త్రిశూల్, కో ఆప్షన్ మెంబెర్స్ మోడేపు పద్మ, ఎండి జాకియా, దేశీయ నాయక్, ప్రజా ప్రతినిధులు మున్సిపల్ స్టాఫ్ మెప్మా ఆర్ పి లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి