మా ప్రభుత్వం వచ్చాకే విప్లవాత్మక మార్పులు

Aug 21, 2026 - 00:36
Aug 21, 2026 - 00:37
 0  2
మా ప్రభుత్వం వచ్చాకే విప్లవాత్మక మార్పులు
మా ప్రభుత్వం వచ్చాకే విప్లవాత్మక మార్పులు
మా ప్రభుత్వం వచ్చాకే విప్లవాత్మక మార్పులు
మా ప్రభుత్వం వచ్చాకే విప్లవాత్మక మార్పులు

మా ప్రభుత్వం వచ్చాకే విప్లవాత్మక మార్పులు
 
పేదోళ్లకూ సన్న బియ్యం ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిదే
 
 గత ప్రభుత్వం ఇచ్చిన దొడ్డు బియ్యం బీర్ల కంపెనీలకే పోయింది

అర్హులైన ప్రతి ఒక్కరికీ 15 రోజుల్లో కొత్త రేషన్ కార్డులు అందజేస్తాం

రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు మరియు నీటి పారుదల శాఖ మంత్రి  ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి....

సూర్యపేట. 21 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంఅధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు మరియు నీటి పారుదల శాఖ మంత్రి  ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు అందక అర్హులైన ఎందరో పేదలు ఇబ్బంది పడ్డారని మండిపడ్డారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి పౌరసరఫరాల శాఖను ప్రజల చెంతకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని దాదాపు 80 నుండి 90 శాతం మంది ప్రజలు తినలేకపోయేవారని మంత్రి గుర్తు చేశారు. ఆ బియ్యాన్ని కేవలం ఐదు, పది రూపాయలకే అమ్ముకోవడం లేదా రీసైక్లింగ్ చేసి బీర్ల కంపెనీలకు, కోళ్ల ఫారాలకు తరలించేవారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం ఈ దుస్థితిని మార్చేందుకు దేశంలోనే తొలిసారిగా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల 42 లక్షల మంది పేదలు లబ్ధి పొందుతున్నారని ఆయన వివరించారు.

16 లక్షల కొత్త కుటుంబాలకు రేషన్ కార్డులు గత పదేళ్లలో అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా కాలయాపన చేశారని మంత్రి విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే కొత్తగా 16 లక్షల కుటుంబాలను రేషన్ పరిధిలోకి తీసుకువచ్చిందని, తద్వారా లబ్ధిదారుల సంఖ్యను పెంచామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.06 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ఆహార భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే 15 రోజుల్లో సూర్యాపేట జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికీ రేషన్ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు.
రైతులకు సకాలంలో రూ. 90 వేల కోట్లు రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి.. ఈ రెండున్నరేళ్ల పాలనా కాలంలో రైతుల నుంచి రికార్డు స్థాయిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన 48 గంటల్లోనే ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 90 వేల కోట్లను జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. 1999 నుంచి ఒకే ప్రాంతం, ఒకే పార్టీ నుంచి తనను వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా మొత్తం 7 సార్లు గెలిపించి గుండెల్లో పెట్టుకున్న జిల్లా ప్రజలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనతో పాటు తన సతీమణి పద్మావతి ఎల్లప్పుడూ జిల్లా ప్రజల సేవలో అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత సన్న బియ్యం వంటి సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు. తదుపరి సర్వీస్ లో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామక  పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి,  తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామ్యూల్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కే నరసింహ, పేరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, , అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డిఆర్ఓ ప్రేమ్ రాజ్, డి సి ఓ మోహన్ బాబు, గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, సూర్యాపేట ఆర్డిఓ వేణుమాధవ్ అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు 

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333