మాలలకు న్యాయం జరిగేంతవరకు పోరాటం ఆగదు
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో పూలే విగ్రహం వద్ద కరపత్ర ఆవిష్కరణ..
తిరుమలగిరి 30 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- మాలలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో జరుగుతున్న అన్యాయాన్ని నివారించేందుకు రోస్టర్ విధానాన్ని సవరించాలని జాతీయ మాల మహానాడు డిమాండ్ చేసింది. ఈ నెల 31న ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ తెలిపారు, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి లో ఏర్పాటు చేసిన సమావేశంలో "చలో సెక్రటేరియట్" కు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆయన పలువురు నాయకులతో కలిసి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాలలకు కేటాయించిన 5 శాతం రిజర్వేషన్ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని వారు ఆరోపించారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ 99లో మాలలకు రోస్టర్ పాయింట్ల కేటాయింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, 20 పాయింట్లలోపు రెండు పాయింట్లు మాలలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. మాల విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు పెద్ద సంఖ్యలో చలో సెక్రటేరియట్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో సూర్యాపేట జిల్లా కోకన్వీనర్ గంట యాకోబు, మండల అధ్యక్షుడు గంట సందీప్, ఉపాధ్యక్షుడు పెరుమళ్ళ జానీ, దాసరి ప్రకాష్, గడ్డి దిలీప్, పెరుమాండ్ల జాన్సన్, చిలుకూరి చిరంజీవి, గంట సుమంత్, మేడిద మహేష్, అల్లే ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.