మార్కెట్ కమిటీ పనితీరు బాగుంది

Aug 20, 2026 - 20:14
Aug 20, 2026 - 20:17
 0  1
మార్కెట్ కమిటీ పనితీరు బాగుంది
మార్కెట్ కమిటీ పనితీరు బాగుంది

సూర్యాపేట, 20 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- సూర్యాపేట మార్కెట్ కమిటీ పనితీరు అద్భుతంగా ఉందని, మార్కెట్ కమిటి ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి వైబ్రేంట్ యాక్టివ్ గా పనిచేస్తున్నారని రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  సూర్యాపేట మార్కెట్ లో మూడు కోట్ల 80లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న పలు రకాల మౌలిక వసతులు, గాల్ వ్యాల్యూమ్  షెడ్,  పివి పవర్ ప్లాంట్, రూప్ టాప్  సోలార్  నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ నందు రైతులకు ఉచితంగా అల్పాహారం అందించడం, 5/- లకు మధ్యాహ్న భోజన వసతి కల్పించడం  హర్షనీయమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలు చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రికి చెప్తానని అన్నారు.  మార్కెట్ లో పనిచేసే కార్మికులకు, సిబ్బందికి ఏకరూప దుస్తులు అందజేయడం, కూల్ వాటర్ సౌకర్యాం కల్పించడం పట్ల అభినందనలు తెలిపారు. సూర్యాపేట మార్కెట్ కమిటీ పనితీరు బాగుందని తాను మళ్ళీ ఒకసారి వచ్చి రెండు గంటల సమయం మార్కెట్లో గడుపుతానని, మార్కెట్ ను  పరిశీలిస్తానని ఆయన అన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో అభివృద్ధి కోసం 95 లక్షల రూపాయలు అందజేస్తామని,  అలాగే మామిడి మార్కెట్ కు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించవలసిందిగా జిల్లా కలెక్టర్ కు  సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, ఎస్పి నరసింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, సెక్రటరీ ఫసియుద్దిన్,  సూర్యాపేట ఆర్డివొ  వేణుమాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333