మానవత్వం చాటుకున్న మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఊరుగాని ఊరు, హైదరాబాద్ లో తెలిసిన మనిషీ లేడు.. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ముషిపట్ల నుంచి నమ్మకం పెట్టుకొని ముగ్గురు చిన్నపిల్లలతో బస్సెక్కింది ఓ భర్త చనిపోయిన అభాగ్యురాలు.. కనిపించినవారిని అడ్రస్ అడుగుతూ చివరికి మంత్రి కోమటిరెడ్డి ఇంటి దగ్గరికి చేరింది.
రానైతే వచ్చింది కానీ.. తెలిసిన మనిషిలేడు.. మంత్రిని జీవితంలో ఒక్కసారి కలిసిందీ లేదు.. మంత్రిని కలిపించమని ఎవరినైనా.. అడుగుదామంటే ఏమంటారోననే భయం. బిక్కు బిక్కుమంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటి ముందు ముగ్గురు చిన్నపిల్లలతో కలిసి దీనంగా కూర్చుంది ఆ మహిళ.
తన దినచర్యలో భాగంగా బయటికి వెళ్తున్న మంత్రి.. అక్కడ కూర్చున్న ఆ తల్లిని చూసి.. ఎవరమ్మా మీరు అంటూ పలకరించారు..
మంత్రి పలకరింపుతో.. భోరున ఏడుస్తూ తన కష్టాన్నంతా చెప్పింది ఆ తల్లి. తన భర్త బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయాడని ఆస్తులన్నీ అమ్మి చికిత్స చేయించానని.. కానీ తన భర్త తనకు దక్కలేదని.. చేతిలో చిల్లిగవ్వ లేక పిల్లల్ని పోషించలేకపోతున్నాని.. సిఎంఆర్ఎఫ్ ఇప్పించాలని కోరింది..