మానవత్వం చాటుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే సతీమణి

తిరుమలగిరి 22 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామానికి చెందిన వంగూరి ఎల్లమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు మృతి చెందింది కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేని దయనీయ పరిస్థితుల్లో ఉండి అనారోగ్యంతో మృతి చెందడంతో విషయాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా తెలుసుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సతీమణి యాదమ్మ బాధిత కుటుంబానికి తన వంతు సహాయంగా అంత్యక్రియల కోసం 50వేల రూపాయలను ఆర్థిక సహాయం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పెద్దలు తదితరులు ఉన్నారు. .