మాజీ చైర్మన్ చొరవతో రక్షించబడిన 50 లక్షల రూపాయల విలువచేసే శ్రీ కుసుమ హరినాథ్ బాబా వారి విలువైన స్థలం

Apr 21, 2026 - 19:53
 0  1
మాజీ చైర్మన్ చొరవతో రక్షించబడిన 50 లక్షల రూపాయల విలువచేసే శ్రీ కుసుమ హరినాథ్ బాబా వారి విలువైన స్థలం

తెలంగాణ వార్తఏప్రిల్ 21జిల్లాస్టాపర్, టెంపుల్  టౌన్ భద్రాచలం : దివ్య క్షేత్రం భద్రాచలం రామాలయానికి దక్షిణంగా ఉన్న శ్రీ కుసుమ హరినాథ్ బాబా దేవస్థానమునకు భద్రాచలం పట్టణంలో కోట్లాది రూపాయలు విలువచేసే భూములు ఉన్నాయి. ఈ భూములు ఇంటి స్థలాలకు ఉపయోగించే కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు. ఈ దేవస్థానానికి 2017 లో నామినేట్ అయిన ధర్మకర్తల మండలి వారు. భద్రాచలం పట్టణంలో ఏ ఏ ప్రదేశాలలో హరినాథ్ బాబా దేవాలయ భూములు ఆక్రమణకు గురిఅయ్యిఉన్నాయో గుర్తించి, అక్కడ ఇండ్లు నిర్మించుకున్న సుమారు 53 మందికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. 

అలాగే భద్రాచలంలో ఓల్డ్ ఎల్ఐసి ఆఫీస్ సమీపంలో డాక్టర్ సుబ్బరాజు హాస్పటల్ ప్రక్కన ఉన్న 50 లక్షల రూపాయలకు పైగా విలువచేసే సుమారు 5 సెంట్ల స్థలాన్ని ఆక్రమణ నుండి రక్షించి దేవస్థానం  స్థలం ఆక్రమించిన వారు శిక్షార్హులు అవుతారని బోర్డు పెట్టించడం కూడా జరిగింది.
అలాగే గోళ్లగ ట్ట రోడ్లో ఆక్రమణకు గురై 53 ఇండ్లు నిర్మించుకున్న ప్రాంతంలో కూడా హెచ్చరిక బోర్డులు గత ట్రస్ట్ బోర్డు వారు ఏర్పాటు చేశారు. 2017లో ఏర్పాటైన ట్రస్ట్ బోర్డు కాలపరిమితి కేవలం ఒక సంవత్సరం కావడం వల్ల కాలపరిమితి పూర్తి కావడంతో పట్టించుకునే నాధుడు లేక, అధికారులకు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల, 53 ఇండ్లు నిర్మించుకున్నఆ ప్రదేశం హరినాథ్ బాబా దేవస్థానానికి చెందుతుందని ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పటికీ అక్రమంగా ఇల్లు నిర్మించుకున్న వారి వద్ద నుండి నేటికీ సొమ్ములు వసూలు చేయకపోవడం తో భక్తులు ఆవేదన చెందుతున్నారు. 

డాక్టర్ సుబ్బరాజు హాస్పటల్ ప్రక్కన ఉన్న 50 లక్షల రూపాయలకు పైగావిలువైన స్థల0 ఆక్రమణకు గురవుతుంటే దేవాలయ అధికారులు పట్టించుకోకపోవడంతో 2017లో చైర్మన్గా ఆ స్థలాన్ని కాపాడిన అప్పటి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్. మీడియా ద్వారా ఖండిస్తూ, ఆ విషయాన్ని కుసుమ హరినాథ్ బాబా ఆలయ ఈవో కు కూడా ప్రత్యక్షంగా కలసి ఈ స్థలం దేవస్థానం కు చెందినది అని గట్టిగా వాదించడం వల్ల, ఆ స్థలం వద్ద మళ్లీ హెచ్చరిక బోర్డు పెట్టించడంతో 50 లక్షలకు పైగా విలువ చేసే స్థలం ఆక్రమణకు గురి కాకుండా మిగిలింది.
ఇది ఇలా ఉండగా కూనవరం రోడ్లో ఆరు 6 ఎకరాల దేవాలయం భూమి పై ఎల్ టి ఆర్ కేసు నమోదై ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూమి విలువ సుమారు ఐదు 5 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా, భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న పిల్లల పార్కు, మరియుసమీపంలోని ఆక్రమణ ద్వారా కట్టుకున్న ఇండ్లు శ్రీ కుసుమ హరినాథ్ బాబా దేవస్థానానికి చెందిన వని, ఈ విషయంలో కూడా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు (కమిషనర్) జోక్యం చేసుకొని తగు చర్యలు తీసుకున్నట్లయితే, హరినాథ్ బాబా దేవస్థానానికి కోట్ల రూపాయలు ఆదాయంగా వచ్చే అవకాశం ఉన్నదని భక్తులు తెలియ చేస్తున్నారు.
ఎండ్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333