మహిళా శక్తికి గద్వాల పోలీస్ శాఖ వందనం

Mar 6, 2026 - 20:06
Mar 6, 2026 - 20:13
 0  0
మహిళా శక్తికి గద్వాల పోలీస్ శాఖ వందనం
మహిళా శక్తికి గద్వాల పోలీస్ శాఖ వందనం

➤  గద్వాల్ జిల్లాలో ఉమెన్ ఫోర్స్ సమర్థవంతంగా పనిచేస్తోంది

➤ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సిబ్బందితో ప్రత్యేక సమావేశం – జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు.


 జోగులాంబ గద్వాల 06 మార్చి 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 ను  పురస్కరించుకొని జోగుళాంబ గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలోని గ్రీవెన్స్ హాల్లో శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్., మహిళా పోలీస్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమం జనగణమనతో ప్రారంభమై, అనంతరం జ్యోతి ప్రజ్వలనతో ముందుకు సాగింది. ఈ సందర్భంగా జిల్లా ఉమెన్ ఫోర్స్‌కు చెందిన  దివ్యవాణి, సఖి సెంటర్ నుంచి అడ్మినిస్ట్రేటర్  అరుణ, భరోసా నుంచి డీఈఓ  శ్వేత, డిపి గోవింద్ నుంచి రేష్మ భాను, రెహానా బేగం,  తదితర మహిళా సిబ్బంది మహిళా సాధికారతపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉత్తేజకరమైన ప్రసంగాలు చేశారు. తరువాత ఎస్ఐ తేజస్విని,  గద్వాల డి.ఎస్పీ.  మొగిలయ్య , సతీష్ కుమార్, ఎస్పీ కె.శంకర్ తదితర అధికారులు కూడా మహిళల పాత్రపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

అనంతరం సందర్భంగా జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు మాట్లాడుతూ..... పోలీస్ శాఖలో మహిళల కోసం మరిన్ని సంస్కరణలు అవసరమని తెలిపారు. జిల్లాలో మహిళా పోలీస్ సిబ్బంది ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారని, గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో ఒక నిండు గర్భిణీ మహిళా సిబ్బంది ఎక్కడ కూర్చోకుండా ధైర్యంగా విధులు నిర్వహించిన సంఘటన మహిళల కర్తవ్యనిష్ఠకు నిదర్శనమని గుర్తు చేశారు. అలాగే దేశవ్యాప్తంగా మహిళా శక్తిని ప్రతిబింబించే అనేక ఘటనలను ప్రస్తావిస్తూ, మహిళలు అన్ని రంగాల్లో సమర్థవంతంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. ప్రతి మహిళా ఉద్యోగి తన విధుల్లో ప్రతిభ కనబరుస్తూ ఇతరులకు ప్రేరణగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కే. శంకర్, ఓఎస్‌డీ సతీష్ కుమార్, గద్వాల్ డీఎస్పీ వై. మొగిలయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, పోలీస్ కార్యాలయ సూపర్డెంట్ నాగమణి, ఐటి కోర్ ఎస్సై తేజస్విని, మనోపాడు ఎస్సై స్వాతి, భరోసా ఎస్సై తారక, షీ టీమ్, భరోసా, సఖి సిబ్బంది, జిల్లా మహిళా కానిస్టేబుళ్లు, ఆర్మ్డ్ రిజర్వ్ మహిళా సిబ్బంది, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State