మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం.

జిల్లా ఎస్పీ  టి.శ్రీనివాస్ రావు, ఐపీఎస్.

Feb 27, 2025 - 19:18
Feb 27, 2025 - 19:20
 0  14
మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం.

జోగులాంబ గద్వాల 27 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :- జిల్లాలో మహిళలు, యువతులు, బాలికల పై జరిగే లైంగిక వేదింపులకు అడ్డుకట్ట వేసేందుకు పని చేస్తున్న జోగుళాంబ గద్వాల్ పోలీస్ షి టీమ్ జనవరి నెలకు గాను ఉత్తమ పనితీరును కనబరచి మల్టీ జోన్ -II జిల్లాలలో మొదటి స్థానం లో నిలిచిందని జిల్లా ఎస్పీ  టి శ్రీనివాస రావు తెలిపారు. పోలీస్ శాఖ మహిళల భద్రతకు తోలి ప్రాధాన్యతను ఇస్తూ వారికి వ్యతిరేకంగా జరిగే నేరాలపై తక్షణమే చర్యలు తీసుకోవడం తో పాటు మహిళలకు వారి హక్కులు, చట్టాల పై అవగహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే ఈవ్ టీజింగ్ కు అడ్డుకట్ట వేసేందుకు షి టీమ్ బృందాల ద్వారా నిఘా వేసి నిందితులను పట్టుకొని తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా జిల్లా లో షి టీమ్ బృందం గత జనవరి నెలలో 14 ఫిర్యాదులు స్వీకరించి ఈవ్ టీజింగ్ కు పాల్పడిన 13 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని 1ఎఫ్ ఐ అర్. కేసు ,13 పెట్టి కేసులు నమోదు చేపించి జిల్లా లో గుర్తించిన హాట్ స్పాట్స్ ను తరచు సందర్శించడం ద్వారా మల్టీ జోన్ -II లోని 13 జిల్లాలలో జోగుళాంబ గద్వాల్ పోలీస్ షి టీమ్ ఉత్తమ పనితీరును ప్రదర్శించి మొదటి స్థానం లో నిలవడం అభినందనీయం అని జిల్లా ఎస్పి అన్నారు.
జిల్లా లో మహిళలు ఏలాంటి వేదింపులకు గురైన వెంటనే నిర్భయంగా పోలీస్ షీ టీమ్ ను ఆశ్రయిస్తే సత్వర న్యాయం చేకూరుస్తామని, మహిళలు సామాజిక మాద్యమాలైన ఫేస్బుక్,వాట్సాప్ ,ఇన్స్టాగ్రామ్ వినియోగంలో జాగ్రత్తలు వహించాలని, వాటిలో ఫొటోలు,వీడియోలు పోస్టుచేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా లో ఎవరైనా వేధింపులకు గురైన షి టీమ్ ను నేరుగా సంప్రదించలేని వారు 8712670312 ఫోన్ నంబరుకు లేదా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పి తెలిపారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State