మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దీక్షలు తీసుకున్న వివిధ గ్రామాల శివ స్వాములకు

తుంగతుర్తి: మర్చి 1 తెలంగాణ వార్త ప్రతినిధి తుంగతుర్తి మండల కేంద్రంలోని స్వయంభూ మహదేవర లింగస్వామి దేవస్థానం లో ఇరుముడి కార్యక్రమం డాక్టర్ హరికిషన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. తుంగతుర్తి, గానుగుబండ, గొట్టిపర్తి, జలాల్పురం, అడ్డగూడూరు, గుండెపురి తదితర గ్రామాల శివ స్వాములకు ఈరోజు ఇరుముడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 4౦ రోజులుగా దీక్షలో ఉన్నటువంటి శివ స్వాములు ఈరోజు శ్రీశైలం యాత్రకు వెళుతున్నారు. శివ గురుస్వామి డాక్టర్ హరికిషన్ గారి ఆధ్వర్యంలో గణపతి హోమం, నవగ్రహ హోమం, రుద్ర హోమాలు నిర్వహించి, రుద్రాభిషేకాలను నిర్వహించి శ్రీశైల యాత్రకు బయలుదేరారు. వివిధ గ్రామాల నుండి విచ్చేసిన భక్త బృందం స్వాములను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప్పుల మధు, నారగాని వెంకన్న, తోటకూర రమేశ్, బత్తుల యుగంధర్, బొంకూరి నాగరాజు, మాచర్ల అనిల్, లక్ష్మణ్, హరికృష్ణ, మహేందర్, పరశురాములు, సతీష్ మొదలగువారు జ్యోతిర్ముడి ధరించారు.