మహా..ప్రబో గద్వాల డిపోలో బస్సులు పెంచండి

జోగులాంబ గద్వాల 29 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. జిల్లా కేంద్రంనుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే బస్సుల అవస్థలు తప్పడం లేదు?? అలాగే స్కూల్ కాలేజ్ టైంలో సాయంకాలం పూట విద్యార్థులు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న వైనం అందరికి తెలిసిందే!!దీనికి ఉచిత బస్సు ఎఫెక్ట్ అంటారా? లేకపోతే స్కూల్ కాలేజ్ టైంలో బస్సులో లేకపోవడం ఏంటి అని విద్యార్థులు ఇతరత్రా వారు అనుకుం టున్నారు. వెంటనే బస్సులు పెంచి.. టైం టు టైం నడపాలని విద్యార్థులు దూర ప్రాంతాల ప్రయాణికులు సంబంధించిన అధికారులను కోరారు.