గద్వాల్ ట్రాఫిక్ పోలీసులకు చలువ కళ్లద్దాలు పంపిణీ

 - జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు

Apr 20, 2026 - 18:02
Apr 20, 2026 - 18:03
 0  10
గద్వాల్ ట్రాఫిక్ పోలీసులకు చలువ కళ్లద్దాలు పంపిణీ
గద్వాల్ ట్రాఫిక్ పోలీసులకు చలువ కళ్లద్దాలు పంపిణీ

మండే ఎండలో విధులు నిర్వర్తించే పోలీసులకు ఉపశమనం… సేవాభావానికి నిదర్శనం

 జోగుళాంబ గద్వాల 20 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- గద్వాల్. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్.,   ఆదర్శప్రాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండే ఎండలో నిరంతరం విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు చలువ కళ్లద్దాలు (సన్ గ్లాసెస్) పంపిణీ చేసి వారికి ఉపశమనం కలిగించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ట్రాఫిక్ పోలీసుల సేవలు సమాజానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఎండలో గంటల తరబడి విధులు నిర్వర్తించే సమయంలో కళ్ల రక్షణ ఎంతో అవసరమని, ఈ కళ్లద్దాలు వారి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు విధుల్లో మరింత చురుకుదనాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.

అలాగే ప్రస్తుత ఎండల తీవ్రత దృష్ట్యా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. తగిన రక్షణ చర్యలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు నరేష్, విద్యాసాగర్,  ఆర్‌ ఎస్సై బాలచంద్రుడు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State