మల్దకల్ దేవాలయం దర్శించుకున్న పార్లమెంట్ అభ్యర్థి.
జోగులాంబ గద్వాల 8 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మల్దకల్. ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని బుధవారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట గొంగళ్ల రంజిత్ కుమార్ గద్వాల జిల్లా బిజెపి అధ్యక్షుడు రామచంద్రారెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఆయనకు దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు స్వామి వారి శేష వస్త్రం బహుకరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు ఉన్నారు.