*వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ఎక్కువగా చెట్లు పెంచాలి*

Aug 6, 2024 - 19:38
Aug 6, 2024 - 20:47
 0  6
*వాతావరణ సమతుల్యాన్ని  కాపాడేందుకు ఎక్కువగా  చెట్లు పెంచాలి*

వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ఎక్కువగా చెట్లు పెంచాలి

 రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క

ఆగస్టు 6 గోవిందరావుపేట తెలంగాణ వార్త:- వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ఎక్కువగా చెట్లు పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు.మంగళవారం గోవిందరావు పేట మండలం చాల్వయి గ్రామం బుస్సాపూర్ రోడ్డు లో గల 5 వ బెటాలియన్ క్యాంపు లో రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమము ప్రత్యెక అధికారి, ఎస్. క్రిష్ణ ఆదిత్య, లేబర్ డైరెక్టర్, ఉపాధి & శిక్షణ జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి. శ్రీజ ఓఎస్డి మహేష్ బాబా సాహెబ్ గీతే, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, సీఎంటి టి. అలెక్ లతొ కలసి స్వచ్చ దనం పచ్చదనం కార్యక్రమం లో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం వ్యాస రచన, ఉపన్యాసం లో 

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సరిఫికేట్స్, బహుమతులు అందచేశారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ చెట్లను పెంచకపోవడం, ఉన్న చెట్లను నరికి వేయడం వంటి కారణాలవల్ల వాతావరణ సమతుల్యాన్ని కాపాడడంలో విఫలమవుతున్నామని, అందువల్ల పచ్చదనాన్ని కాపాడాల్సిన అవసరం అందరిపై ఉందని ,ఇందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమంలో విద్యార్థులు ,యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని, మొక్కల పెంపకంలో భాగంగా పండ్ల మొక్కలతో పాటు, పూల మొక్కలను పెంచాలని సూచించారు. మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని 5 రోజులు మాత్రమే కాకుండా నిరంతప్రక్రియగా అలవాటు చేసుకోవాలనీ అన్నారు.

ములుగు జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ 

అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉన్న జిల్లా అని, జిల్లాలో 100 కిలోమీటర్ల మేర గోదావరి నది పరవాళ్ళు, ఎక్కువమంది పర్యాటకులను ఆకర్షించే పర్యాటక ప్రాంతాలకు ములుగు జిల్లా కేంద్ర బిందువుగా ఉందని మంత్రి కొనియాడారు.

మానవుడు నివసించే పరిసర ప్రాంతాలు పచ్చదనంగా , స్వచ్ఛదనంగా ఉంటేనే జీవన ప్రమాణాలు పెరుగుతాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటాలని, మరింత బాధ్యతగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, పచ్చదనాన్ని పెంపొందించాలని మంత్రి తెలిపారు. చెట్లను ఎక్కువగా పెంచడం వల్ల సూర్యరశ్మి నేరుగా భూమిపై పడే అవకాశం ఉండదు. కాబట్టి భూగర్భ జలాలు పెరిగే అవకాశం కూడా ఉంటుందని గ్రామీణ ప్రాంతాలలో కుంటలు చెరువుల పరిసర ప్రాంతాలలో చెట్ల పంపకం చేపట్టాలని సూచించారు. సైంటిఫికంగా ఒక ప్రణాళిక బద్ధంగా చెట్ల పెంపకం జరిగేలా చూడాలని జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ ను కోరారు.

ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి క్రిష్ణ ఆదిత్య మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో మొక్కలను నాటడం జరుగుతుందని నాటడమే కాకుండా వాటి సంరక్షణ కూడా తప్పనిసరిగా చూసుకోవాలని సూచించారు. మొక్కలను కాపాడే బాధ్యత కేవలం అధికారులదే కాదని ప్రతి ఒక్కరి తప్పనిసరి విధులలో మొక్కలను కాపాడడం ఒక భాగం అని పేర్కొన్నారు. మొక్కలు ఎక్కువగా ఉన్నచోట సమృద్ధి అయిన వర్షపాతం నమోదవుతుందని వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందని నగర ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండటానికి ప్రధాన కారణం పచ్చదనమే అని , దానితో పాటుగా నివసించే ప్రదేశాలు పరిశుభ్రంగా చూసుకుంటే ప్రజలు ఎలాంటి అనారోగ్యాలకు గురికారని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం పాటిస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని , పరిసరాలను పరిశుభ్రంగా చూసుకోకపోతే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుందని దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి శ్రీకారాం చుట్టిందని ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు చెట్లను బాధ్యతయుతంగా పెంచాలని సూచించారు.

ఈ కార్యక్రమంలోడి ఎస్ పి రవీందర్, మండల ప్రత్యెక అధికారి విజయ చంద్ర, ఎంపి డి ఓ, సంబంధిత అధికారులు, పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.