మల్దకల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ పోస్టులకు పోటాపోటీగా దరఖాస్తులు
మల్దకల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ పోస్టులకు పోటాపోటీగా దరఖాస్తులు
22 టీచర్ పోస్టులకు 434 మంది పోటీ
వెల్లడించిన సీడీపీఓ ఆకాశ దీప్తి
జోగులాంబ గద్వాల 8 జూలై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల జిల్లా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఉత్తర్వుల మేరకు, మల్దకల్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ముగిసిందని ప్రాజెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆకాశ దీప్తి తెలిపారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిబంధనల ప్రకారం ఆన్లైన్ ద్వారా ఈ దరఖాస్తులను స్వీకరించినట్లు ఆమె పేర్కొన్నారు.
పోస్టుల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలు:
అంగన్వాడీ టీచర్స్ :
మల్దకల్ ప్రాజెక్ట్ పరిధిలో మొత్తం 22 ఖాళీలు ఉండగా, వీటికి రికార్డు స్థాయిలో 434 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు సగటున 19 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
అంగన్వాడీ హెల్పర్స్:
మొత్తం 4 సహాయకురాలి (ఆయా) ఖాళీలు ఉండగా, వీటికి 19 మంది అర్హులైన స్థానిక మహిళలు దరఖాస్తు చేసుకున్నారు.
పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ:
వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలిస్తామని సీడీపీఓ తెలిపారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, పూర్తిగా ప్రభుత్వ మార్గదర్శకాలు మరియు మెరిట్ ఆధారంగానే అర్హులైన స్థానిక మహిళా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని ఆకాశ దీప్తి స్పష్టం చేశారు.