మందకృష్ణ మాదిగ చేసిన పోరాటమేఫలితమే వర్గీకరణ

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ మందకృష్ణ మాదిగ చేసిన పోరాటమేఫలితమే వర్గీకరణ. మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం.. ఆత్మకూర్ ఎస్.. మాదిగ జాతి మహాత్ముడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేసిన పోరాటమే మాదిగ జాతి బిడ్డల భవిష్యత్తుకు రాజమార్గం మని మండల అధ్యక్షుడు మేడి కృష్ణ మాదిగ అన్నారు. బుధవారం మండల కేంద్రం లో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం హర్షనీయమని తెలిపారు. మందకృష్ణ మాదిగ పేరు భవిష్యత్తు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయేలా పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. మందకృష్ణ మాదిగ లేకుంటేనేడు ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందేది కాదని 30ఏళ్ల పోరాట పలితమన్నారు. మాదిగ మాదిగ ఉప కులాలు ఎస్సీ రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జ్ ములకలపల్లి రవి మాదిగ, మారుపెల్లి జగన్ మాదిగ, తిప్పర్తి గంగరాజు మాదిగ, మిర్యాల చిన్ని మాదిగ, పిడమర్తి ఉమేష్ మాదిగ, బొల్లె పాక ముత్తి లింగయ్య మాదిగ, ఇరుగు యాదయ్య మాదిగ, నవ్విలే లింగరాజు మాదిగ బొల్లెపాక మహేష్ మాదిగ, పాల్వాయి వెంకటేష్ మాదిగ, పిడమర్తి శీను మాదిగ, బత్తుల సురేందర్ మాదిగ, యాతాకుల మల్లయ్య మాదిగ, ఇరుగు విష్ణు మాదిగ, రమేష్ మాదిగ నవీన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.