మంత్రిగారి అండతో 40 సంవత్సరాల నుండి ఉన్న చేతి పంపు బోరు రాత్రికి రాత్రి మాయం

10-02-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల పరిధిలో కొప్పునూరు గ్రామస్తులు ప్రెస్ మీట్.
చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన కొప్పునూరు గ్రామంలో మంత్రి జూపల్లి గారి అనుచరుల కబ్జాలు? ప్రెస్ మీట్ ఏర్పాటుచేసిన స్థానిక కాలనీవాసులు .
ప్రజలు త్రాగే చేతి బోరు, బావి రాత్రికి రాత్రే మాయం?
అదే స్థానములో లాట్రిన్ డ్రైనేజ్ గుంత నిర్మాణం చేసిన మంత్రి అనుచరుడు .
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కొప్పునూరు గ్రామంలో ఐదవ వార్డులో మంత్రిగారి ప్రధాన అనుచరుడు మాజి సర్పంచ్ సమీప బంధువు ఆదేశం తో ముష్టి నరసింహ ప్రజలు నిత్యము త్రాగే హ్యాండ్ బోరు రాత్రికి రాత్రె జెసిబి సహకారంతో బోరును పేకలించి డ్రైనేజీ గుంత నిర్మాణం. గొప్ప ఘన కార్యము చేశారు. మంత్రి గారు తన ప్రధాన అనుచరుడి ఆదేశంతో ఈ నిర్మాణం జరిగిందన్న స్థానికులు. స్థానికులు కాలనీవాసులు మంత్రిగారి అనుచరుడి దగ్గర తమ గోడు వెళ్ళబోసుకుంటే తాము ఎన్నో సంవత్సరాల నుండి ఆ బోరు మాకు త్రాగడానికి నీరు పుష్కలంగా ఇచ్చిందని,ప్రస్తుతం ఆ బోరు పుడ్చడానికి వీలులేదని ఆడ్డు చెప్పగా ఆ బోరు గురించి వదిలేయండి, మీకు కావలిస్తే ఇంకో జాగాలో బోరు వేస్తానాని ఉచిత సలహాతో సర్దిపెట్టారు. పైగా ఆ స్థలము తన బంధువుదే అనవసరంగా రాజకీయం చేస్తున్నారని అంటూ ఇలా వుంటే ఊరు బాగుపడదని అర్థం లేని వాగుడు వాగరు. కాని దాదాపు 40 ఏళ్లకు పైగా అక్కడ బోరు ఉన్నదని ఈ రోడ్డు నక్స రోడ్డు స్థలమని పెద్ద గొలుసు పెట్టున్న రోడ్డు వైసల్యమని బోరు వున్న స్థలము ఈ రోడ్డుకు సంబంధించిన స్థలము అని స్థానికులు గ్రామస్తులు అంటుంటే కాదు ముష్టి నరసింహాదే అంటున్న మంత్రి గారి ప్రధాన అనుచరుడు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇంత దుర్మార్గం ఇంత అన్యాయమా అంటూ స్థానిక కాలనీవాసులు చేసేదేమి లేక తమ గోడు సంబంధిత గ్రామపంచాయతీ సెక్రెటరీ, మండల డెవలప్మెంట్ ఆఫీసర్కి, గ్రామ పంచాయితీ స్పెషల్ ఆఫీసర్కి, జిల్లా కలెక్టర్ గార్కి ఫిర్యాదు చేశారు.అధికార నాయకుల బలంతో దౌర్జన్యానికి భయపడి సంబంధిత అధికారులు ఇప్పటికీ ఎలాంటి చర్య తీసుకోకుండా అట్టహాసంగా మంత్రి గారి ముఖ్య అనుచరుడి ఆదేశంతో బోరు పీకి వేసిన స్థానంలో డ్రైనేజీ పనులు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు నిత్యము త్రాగే నీటి బోర్ జేసిబితొ పీకివేసి డ్రైనేజీ నిర్మాణం చేయుట మంత్రి గారు తన నమ్మిన బంటు రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చే దిగజారిన ప్రధాన అనుచరుడుపై బంధువుపై ఏ విధంగా స్పందిస్తారో ఏమి చర్య తీసుకుంటారో వేచి చూడాలి. తక్షణమే మాకు త్రాగడానికి అదే స్థానములో బోరు నిర్మాణం చేయాలంటున్న కాలని వాసులు డిమెండ్ చేస్తున్నారు. లేదంటే తమ ప్రాంతం బోరు కాపాడుకొనుట కోసం ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రజా పాలన అంటే ఇదేనా అంటున్న కాలని వాసులు ప్రశ్నిస్తున్నారు.
ఇట్టి ప్రెస్ మీట్ కార్యక్రమంలో భగత్ సింగ్ యువజన సంఘం అధ్యక్షులు చల్లా మధు రాజు, వినోద్, శ్రీను, సాయి, రమేష్ అదేవిధంగా ఈ కాలనీవాసులకు మద్దతుగా మాజీ ఉపసర్పంచ్ కురుమయ్య, మరియు బిజెపి నాయకులు ఉగ్ర నరసింహ, మద్దతు తెలపడం జరిగింది.