కొనసాగుతున్న ఇసుక దందా

Feb 10, 2025 - 20:08
 0  3
కొనసాగుతున్న ఇసుక దందా

తెలంగాణ వార్త ఆత్మకూర్ ఎస్ కొనసాగుతున్న ఇసుక దందా ఇసుక దందా కోసం అక్రమ దారులు మారుతున్న పార్టీలు అడిగిన వారిపై దాడులు.. అధికారుల కనుసన్నలతోనే ఇసుక దందా.. ఆత్మకూర్ ఎస్.. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా ఎన్ని వత్తిడులు తెచ్చినా ఆన్లైన్ పద్దతి లో ఇసుక సప్లయి ఇచ్చినా ఇసుక దందా ఆగడం లేదు. ఇదేమిటని అడిగిన వారిపై దాడులు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆత్మకూరు ఎస్ మండలంలో ఇసుక దందాకు గతంలో కొందరు అధికారులు చర్యలకు బలైనప్పటికీ కొద్దిరోజులు ఆగిన ఈ దందా మల్లి కొనసాగుతుంది. ఆన్లైన్ పద్ధతిలో ఇసుకను తెచ్చుకునేందుకు ప్రభుత్వం వెబ్సైట్ ఓపెన్ చేసినప్పటికీ జాజి రెడ్డి గూడెం నుండి తెచ్చుకునేందుకు కొందరు ఆసక్తి చూపిన మరికొందరు మండలంలోని గ్రామాల్లో ఇసుక దందా కొనసాగిస్తున్నారు. ఇసుక దందా కోసం కొందరు పార్టీలు మారి మళ్ళీ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఈ దందాకు అధికారులు అంతర్గతంగా సహకరిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇల్లు కట్టుకునేందుకు ఇసుక కావాలని కోరినప్పటికీ ఇసుక దందా కొనసాగించేవారు ఎక్కువ రేటుకి అమ్ముకునేందుకు స్థానికులకు ఇసుకను విక్రయించడం లేదు. స్థానికులకు ఇసుక విక్రయించకుండా అక్రమ దందా చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసిన వారిపై ఇసుక దందా చేసేవారు దాడులకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని ఏపూర్ గ్రామంలో గత మూడు రోజుల క్రితం చోటుచేసుకుంది. మండలంలోని ఏపూరు రామన్నగూడెం, ముక్కుడు దేవులపల్లి గ్రామాల ఏటి నుండి గత 15 రోజులుగా జోరుగా అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ ద్వారా కొనసాగుతున్నట్లు స్థానికుల ఆరోపిస్తున్నారు. ఏపూరి గ్రామానికి చెందిన రావుల సంజీవ తన ఇంటికి నిర్మాణం కోసం ఇసుక కావాలని ఇసుక విక్రయించే వారిని అడగగా స్థానికులకు తక్కువ రేటుకు అమ్మడం లేదని పక్క ఊర్లోకి 8000 నుంచి 10000 రూపాయలకు అమ్ముకుంటున్నమని తెలిపారు. గ్రామం లో అక్రమంగా ఇసుక తరలించచడమే కాకుండా గ్రామస్తులకు ఇసుక విక్రయించక పోతే ఎలా అని అడగడం తో ఇసుక దందాలకు పాల్పడే బెల్లంకొండ రవి, బెల్లంకొండ ఇస్తారి, మల్లయ్య,యశారపు మహేష్, వెంకన్న లు ఈ నెల 7న అర్థరాత్రి ఇంటికొచ్చి ఇస్తాను సారంగా సంజీవ పై దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఈ విషయమై తెల్లారి పోలీసుల కు పిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. గుట్టు చప్పుడు కాకుండా మాట్లాడుకో మంటున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదని సోమవారoవిలేకరుల ను ఆశ్రయించాడు. దాడికి పాల్పడిన ఇసుక అక్రమ దారుల పై చర్యలు తీసుకోవాలని ఇసుక అక్రమ రవాణా ను అరికట్టాలని డిమాండ్ చేశారు. మండలం లోనీ ఏపూర్, ముక్కుడు దేవులపల్లి, రామన్న గూడెం, గ్రామ సమీప ఏటి నుండి విచ్చల విడిగా ఇసుక కొనసాగుతున్నట్లు ఆరోపణ లు వచ్చాయి. రామన్న గూడెం లో ఇసుక అక్రమ రవాణా కోసం ఏకంగా 3లక్షల కు వేలం పాట పాడి ఇసుక రవాణా చేస్తున్నారనీ ఈ ఇసుక వేలం పాటలు పోలీసు అధికారుల పాత్ర ఉన్నదని తెలిసి ఇద్దరు పోలీసు అధికారులను బదిలీ చేసినప్పటికి ఇసుక దందాకు మళ్ళీ తెరలేపడం పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.