మండల అధికారుల సాక్షిగా తలకిందులైన జాతీయ జెండా
జోగులాంబ గద్వాల 15 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల . మండలం కేంద్రంలో జాతీయ జెండా మన జాతి గౌరవానికి ప్రతీక దేశమంతా జాతీయ జెండాను సగర్వంగా రెపరెపలాడిస్తూ జాతీయ పండుగను ఘనంగా జరుపుకుంటుంటే కొందరు అధికారుల నిర్లక్ష్యం జాతీయ పతాకానికి ఘోర అవమానాన్ని తెచ్చిపెట్టింది. జాతీయ జెండా మన జాతి గౌరవానికి ప్రతీక దేశమంతా జాతీయ జెండాను సగర్వంగా రెపరెపలాడిస్తూ జాతీయ పండుగను జరుపుకుంటుంటే కొందరు అధికారుల నిర్లక్ష్యం జాతీయ పతాకానికి ఘోర అవమానాన్ని తెచ్చిపెట్టింది చట్టాలు నిబంధనలు అమలు చేయాల్సిన అధికారుల సమక్షంలోనే సాక్షాత్తు ఇటిక్యాలమండల మహిళా సమాఖ్య (ఐకెపి )కార్యాలయంలో జాతీయ జెండా తలకిందులుగా ఎగిరింది.
ఈ బాధ్యతారహిత ఘటన స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీస్తుంది.
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కేంద్రంలో మండల మహిళా సమైక్య కార్యాలయంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
జెండాను ఎగురవేసేముందు కాషాయరంగు పైకి ఆకుపచ్చ రంగు కిందకు ఉండేలా చూసుకోవాలన్న కనీస బాధ్యత జ్ఞానం కూడా లేకుండా నిర్వాహకులు వ్యవహరించారు. అయితే ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కార్యక్రమానికి హాజరైనటువంటి ఏపీఎం ఇతర మండల స్థాయి అధికారులు సైతం ఈ తప్పును గుర్తించకపోవడం గమనార్హం.
తలకిందులుగా ఉన్న జెండానే ఎగరవేసే చప్పట్లు కొట్టడం సెల్యూట్ చేయడం.
వారి నిర్లక్ష్యానికి విధి నిర్వహణ పట్ల వారికి ఉన్న అనాసక్తికి అడ్డం పడుతుంది. జాతీయ జెండాను తప్పుగా ఎగరవేయడం కించపరచడం( ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా జాతీయ గౌరవ అవమాన నిరోధక చట్టం 1971) ప్రకారం తీవ్రమైన నేరం సామాన్య ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రభుత్వ అధికారులే స్వయంగా జెండాను తలకిందులుగా ఎగురవేసి దేశభక్తిని అపహాస్యం చేయడం పట్ల ప్రజాసంఘాలు మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జెండానే సరిగ్గా ఎగుర వేయలేని వారు పరిపాలన ఏం చేస్తారు?.
ఎంతో పవిత్రంగా జాగ్రత్తగా నిర్వహించాల్సిన జాతీయ జెండా ఆవిష్కరణ లోనే ఇంతటి అలసత్వం ప్రదర్శించిన అధికారులు ఇక నిత్యం గ్రామీణ పేద మహిళలకు సంబంధించిన కోట్లాది రూపాయల లావాదేవీలు పరిపాలన విషయాల్లో ఎంత పారదర్శకంగా బాధ్యతగా పనిచేస్తున్నారో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చని ప్రజలు విమర్శిస్తున్నారు.
జాతీయ పతాకాన్ని అవమానించిన ఈ ఘటనను పై ఉన్నత స్థాయి అధికారులు తీవ్రంగా పరిగణించి జిల్లా కలెక్టర్ డిఆర్డిఓ తక్షణమే దీనిపై స్పందించి జెండా ఎగురవేసే బాధ్యత తీసుకున్న సిబ్బంది ఆ సమయంలో అక్కడ ఉన్న మండల అధికారులపై వెంటనే విచారణ ఆదేశించాలి ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘనను బాధ్యులైన వారిని గుర్తించి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మండల స్థాయి అధికారులందరికీ కఠిన ఆదేశాలు జారీ చేయాలని ప్రజలు చర్చించుకుంటున్నారు.