భూ సమస్య పరిష్కరించాలని.. పురుగుల మందు డబ్బాతో మహిళ హల్‌చల్
జోగులాంబ గద్వాల 4 మార్చి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల రెవెన్యూ అధికారులు తన భూమిని ప్రభుత్వ భూమిగా రికార్డులో ఎక్కించారని, దాని తొలగించాలని కోరుతూ ఓ మహిళ పురుగుల మందు డబ్బాతో కలెక్టరేట్‌లో హల్‌చచేసింది. గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామపురం చెందిన గోకారిబి, కి సర్వే నంబర్ 416 లో ఎరం భూమి ఉంది. అయితే దానిని ప్రభుత్వ భూమిగా రికార్డులోకి అధికారులు ఎక్కించారు. తన భూమిని అధికారులు తప్పుగా ప్రభుత్వ భూమిగా రాశారని, దానిని నా పేరు మీద మార్చాలని ఎన్నిసార్లు తహసిల్దార్, అదనపు కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకోవడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తన భూమిని తన పేర ఎక్కించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని అదనపు రెవెన్యూ కలెక్టర్ కార్యాలయం ముందు గో కార బి, పురుగుల మందును సేవించడానికి ప్రయత్నించారు. గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. బాధిత మహిళకు న్యాయం చేస్తామని అధికారులు చెప్పారు.