భూ సంబంధ దరఖాస్తులను పరిష్కరించాలి

Sep 25, 2026 - 19:35
 0  1
భూ సంబంధ దరఖాస్తులను పరిష్కరించాలి

రీ సర్వే పనులు వేగవంతం చేయాలి. 

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

 జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  భూ సంబంధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. రీ సర్వే, భూభారతి, సాదా బైనామా, తదితర రెవెన్యూ అంశాలపై శుక్రవారం జిల్లా కలెక్టర్ అన్ని మండలాల తహసిల్దార్లతో కలెక్టరేట్లోని తన ఛాంబర్ నుంచి వేబెక్స్ ద్వారా సమావేశమై మాట్లాడారు. రెవిన్యూ అంశాలపై చర్చించడానికి ఈ నెల 28న వనపర్తి లో జరిగే ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన సమగ్ర రెవెన్యూ సమాచారంతో హాజరు కావాలన్నారు. భూభారతి, సాదా బైనామా, తదితర దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలన్నారు. తిరస్కరించబడ్డ దరఖాస్తులకు తగిన కారణాలు చెబుతూ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రీ సర్వే పనులు వేగవంతం చేయాలని, లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు తొమ్మిది గ్రామాల్లో రిసర్వే పనులు ప్రారంభించగా, రెండు గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తయిందని మిగిలిన గ్రామాల్లోనూ ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, సర్వే ఏడి నూకరాజు, ఆయా మండలాల తహసిల్దార్లు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333