పోషకాహారంపై అవగాహన
జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : మండలంలోని షేక్ పల్లి గ్రామంలో శుక్రవారం 2వ,అంగన్వాడి కేంద్రంలో పోషణ కార్యక్రమం నిర్వహించారు.మహిళలు,గర్భిణులు,బాలింతలకు ఆరోగ్యం,పరిశుభ్రత,పోషకాహారంపై ఐసీడీఎస్ సూపర్వైజర్ వెంకటేశ్వరమ్మ అవగాహన కల్పించారు. కారపాకుల గార్లపాడు వీరాపురం గ్రామాల టీచర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సిడిపిఓ హేమలత మాట్లాడుతూ..రక్తహీనత నివారణకు ఆకుకూరలు,కూరగాయలు,పండ్లు,పప్పు దినుసులు,చిరుధాన్యాలు తీసుకోవాలని పేర్కొన్నారు.చిన్నారులకు బాలామృతం,గుడ్లు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అంగన్వాడీ టీచర్లు గర్భిణీలు బాలింతలు తదితరులు ఉన్నారు.