భూసారం పై రైతులకు అవగాహన

May 4, 2026 - 21:39
 0  2
భూసారం పై రైతులకు అవగాహన

 ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజులు 

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ 

ప్రజాపాల ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవం

 తిరుమలగిరి 05 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

 తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో  రైతు వేదిక నందు 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఇట్టి కార్యక్రమంలో భూసార పరీక్ష కార్డులు రైతులకు ఇవ్వడంతోపాటు భూసార పరీక్ష యొక్క ప్రాముఖ్యతను మరియు మట్టి పరీక్షల నమూనాల సేకరణ ఏ విధంగా చేయాలో క్షేత్రస్థాయిలో రైతులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి ,  గ్రామ సర్పంచ్ స్వాతి, ఉపసర్పంచ్ గొలుసుల వెంకన్న, వ్యవసాయ విస్తరణ అధికారి కే వెంకటరెడ్డి  మరియు రైతు సోదరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి