భూధాన్ ప్రభుత్వ భూములు దురాక్రమ దారుల ఐదు వాహనాలు సీజ్ పోలీస్ కమిషనర్

Apr 3, 2026 - 12:54
Apr 3, 2026 - 13:55
 0  0
భూధాన్ ప్రభుత్వ భూములు దురాక్రమ దారుల ఐదు వాహనాలు సీజ్ పోలీస్ కమిషనర్

భూదాన్, ప్రభుత్వ భూముల దురాక్రమణదారుల ఐదు వాహనాలు సీజ్...

అక్రమ స్థిర చర ఆస్తులు అటాచ్మెంట్ కోసం చట్టపరమైన చర్యలు : పోలీస్ కమిషనర్

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం:- భూదాన్, ప్రభుత్వ భూముల దురాక్రమణకు పాల్పడి పేద ప్రజల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసి కూడగట్టుకున్న సుమారు 45 లక్షల విలువ చేసే స్థిర చర ఆస్తుల అటాచ్మెంట్ కోసం చట్టపరమైన చర్యలు చేపట్టినట్టు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. *ఇప్పటికే నిందితుల నుండి10 లక్షల 40 వేల విలువ చేసే ఐదు వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.* ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలోని భూదాన్, ప్రభుత్వ భూములపై అక్రమ వ్యాపారాలకు, ఆక్రమణలకు పాల్పడిన నిందుతులపై ఖమ్మం ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్, ఇతర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ తెలిపారు. *ఆయా కేసులలో విచారణలో బాగంగా ఖానాపురం హవేలి పోలీసులు పోలీస్ కస్టడీకి తీసుకున్న నిందుతులు* 1) బల్లి శ్రీనివాస్ @ శ్రీను, 2)పోలెబోయిన ముత్తయ్య, 3) కొప్పెర వెంకన్న, 4) తాళ్లూరి కృష్ణ, 5) కుంజా కృష్ణయ్య @ కృష్ణ, 6) కల్తీ రామ చంద్రయ్య, 7) బాణాల లక్ష్మణాచారి ని విచారణలో వెల్లడించిన వివరాలు ప్రకారంగా సుమారు 1549 మంది పేద ప్రజల (బాధితుల) నుండి వసూలు చేసిన రూ 2,88,38100/- డబ్బుల నుండి కొంత వరకు కోర్టుకు ఖర్చులకు, ర్యాలీలు, సర్వేలు, భూదాన్ వినోబా నవోదయ కాలనీలో తాత్కాలికంగా నిర్మించుకున్న ఇండ్లకు కరెంటు, నీరు, మిగతా సౌకర్యాల పేరుతో ఖర్చు చేశారని,మిగిలిన డబ్బును స్వప్రయజనాలకు, స్థిర ఆస్తుల సంపాదించుకోవడం కొరకు ఖర్చు పెట్టినట్లు నేరాన్ని అంగీకరించారని తెలిపారు. 

1)తాళ్లూరి కృష్ణ, ఒక ట్రాక్టర్ ను నెం. AP 20 TA 1363, కవిరాజ్ నగర్, రోడ్డు నెo.1 లో 64.54 గజాలవిస్తీర్ణంలో ఇంటిపై 19 లక్షల 90 వేల రూపాయలు ఖర్చు చేసి మొదటి, రెండవ అంతస్తు నిర్మాణం చేశారు. 

2) బాణాల లక్ష్మణాచారి, హీరో డీలక్స్ మోటార్ సైకిల్ నెం. TS-05-ER-1100, కొనుగోలు చేశారు.

3) పోలెబోయిన ముత్తయ్య, టాటా మ్యాజిక్ వాహనము నెం. TS-28-T-2868, టాటా ఇంట్రా ట్రాలీ వాహనము నెం. TS-04-UE-6290, 

5) కొప్పెర వెంకన్న, స్ప్లెండర్ మోటార్‌సైకిల్ మోటార్ సైకిల్ నెం. TS-29-B-8489,

10 లక్షల విలువగల ఇండ్ల స్థలం,తన కొడుకు చదువులకు ఖర్చు చేసినాడు.

6) చిప్పలపల్లి వీరయ్య, 4 లక్షల 48 వేల ఏడు వందల నాలభై నాలుగు రూపాయల నగదును, 10 లక్షల రూపాయలు ఎన్కూరు కు చెందిన పొన్నెబోయిన బేబీ వద్ద ఉంచినారు, ఎన్నికల సమయంలో వారి పార్టీ మీటింగులకు కొంత ఖర్చు చేసినారని, అలాగే హుస్నా బాద్ పార్టీ మీటింగ్ కు సుమారు రూ. 10 లక్షలు ఖర్చు చేసినారని, ఇతర ఖర్చులకు, స్వప్రయోజనాలకు వినియోగించినారని వారు అంగీకరించినారు.

కస్టడీ అనంతరం నిందుతులను తిరిగి ఈ రోజు జూడిసియాల్ రిమాండు తరలించడం జరిగింది.

*స్థిర చర అస్తుల విలువ సుమారుగా*

1. వాహనములు (5) : రూ.10,40,000/-.

2. ఇల్లు విలువ : రూ.19,90,000/-.

3. ఇండ్ల స్థలం : 

రూ. 10 ,00,000/-.

4. బ్యాంక్ ఖాతా లో ని నగదు : రూ.4,48,744 /-.

మొత్తము అస్తుల విలువ సుమారు గా : రూ.44,78,744 /-

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State