భీమ్ రెడ్డి నరసింహారెడ్డి త్యాగం మరువలేనిది

తిరుమలగిరి 10 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
భీమిరెడ్డి నరసింహారెడ్డి త్యాగం మరువలేనిదని తిరుమలగిరి మాజీ ఎంపీపీ కొత్తగట్టు మల్లయ్య అన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు బిమిరెడ్డి నరసింహారెడ్డి 17 వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించి మాట్లాడుతూ మూడుసార్లు ఎంపీ గా రెండుసార్లు ఎమ్మెల్యే గా గెలిసిన సామాన్య జీవితం గడిపిన నిస్వార్థజీవి అన్నారు గోదావరి జలాల ద్వారమాత్రమే జిల్లా ప్రజలు పంటలు పండించుకుంటారని నమ్మి వాటి కోసం తన ప్రాణమున్నంత వరకు పోరాటం చేసి సాధించిన వ్యక్తి భీమిరెడ్డిడి , అన్నారు అలాంటి వ్యక్తి ఆశయాలు సాధించాలని ఎస్సారెస్పీ కాలువకు భీమిరెడ్డిి పేరు పెట్టాలని ట్యాంక్ బండిపై ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ సభ్యులు బూర్గుల ప్రభాకర్ నాయకులు సామాజిక వాదులు పి లక్ష్మయ్య ఎల్లయ్య చేను శ్రీనివాసు మల్లయ్య నాయకులు అబ్రహం తదితరులు పాల్గొన్నారు