భార్యపై కోపంతో రెండేళ్ల కూతురుని కడతేర్చిన తండ్రి

Mar 25, 2026 - 19:29
 0  1
భార్యపై కోపంతో రెండేళ్ల కూతురుని కడతేర్చిన తండ్రి

-- సపోటా పండులో ఎలుకల మందు కలిపి హత్య, అనంతరం తాను ఆత్మహత్యాయత్నం

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లక్హమ్మగూడెంలో తమ కూతుళ్లు మేఘన(2), మయూరి(9 నెలల)తో నివసిస్తున్న రవి, స్వాతి అనే దంపతులు

భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా, మూడు నెలల క్రితం చిన్న కూతురిని తీసుకుని స్వాతి పుట్టింటికి వెళ్లగా, తండ్రితో ఉంటున్న పెద్ద కూతురు 

పెద్ద కూతురుని కూడా తన వద్దకే పంపాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా, పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిపిన దంపతులు, వారి కుటుంబ సభ్యులు 

పరువు పోయిందనే కోపం, కూతురు దూరం అవుతుందనే బాధలో, తన పెద్ద కూతురుకి సపోటా పండులో ఎలుకుల మందు కలిపి ఇచ్చి, తాను కూడా ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రవి

గమనించిన కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందిన చిన్నారి, రవి పరిస్థితి విషమం

భార్య స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333