భారీ ఎత్తున గాంధీ భవన్ కు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు
తిరుమలగిరి 12 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
ఎమ్మెల్యే మందుల సామెల్ కు మద్దతు పలికిన కాంగ్రెస్ శ్రేణులు...
మందుల సామేలు తోనే తుంగతుర్తి అభివృద్ధి సాధ్యం..
హైదరాబాద్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశం అనుసారం, గాంధీ భవన్ లో జగ్గారెడ్డి తో నేడు తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామేల్ సమావేశం కానున్న నేపథ్యంలో తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కాంగ్రెస్ శ్రేణులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నూతన మండల పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి, పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. అనంతరం వారు భారీ ఎత్తున హైదరాబాద్ గాంధీ భవన్ కు తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పేరాల వీరేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ జమిలాల్. కందుకూరి లక్ష్మయ్య బత్తుల శ్రీనివాస్ తిరుమణి యాదగిరి పేరాల నరేష్ దానయ్య 16 గ్రామపంచాయతీ సర్పంచులు ఉపసర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు యూవజన కాంగ్రెస్ నాయకులు. తదితరులు పాల్గొన్నారు.