భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం సర్పంచ్ స్వాతి భాస్కర్
తిరుమలగిరి 08 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం తొండ గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం ఇంటింటికీ ట్రాక్టర్ ద్వారా వివిధ రకాల మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భాష మల్ల స్వాతి భాస్కర్ మాట్లాడుతూ గ్రామంలో విరివిగా చెట్లు ఉండడం వల్ల ఆహ్లాదకర వాతావరణంతో పాటు మంచి గాలి దొరుకుతుందని అన్నారు. గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు ప్రతి కుటుంబం కనీసం ఆరు మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యత కాపాడబడటంతో పాటు, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని అన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి పండ్ల, పూల మొక్కలను వేప చెట్లు మరియు అన్ని రకాల చెట్ల ముక్కలను పంపిణీ చేశారు పచ్చదనాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో .ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో.. గ్రామ కార్యదర్శి యాకూబ్ రెడ్డి, ఉప సర్పంచ్ గొలుసుల వెంకన్న, వార్డు మెంబర్స్ సంధ్య ,సోమన్న ,స్రవంతి, నవీన్, వెంకటేష్ (బాలు) ఫీల్డ్ అసిస్టెంట్ గీత ,డాక్టర్ సమతరాణి, ఏఎన్ఎం మాధవి, ఆశ వర్కర్స్ కలమ్మ ,ఉమా, మంజుల, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు...