భద్రాచలంలోరామ నారాయణ, ఆస్థాన పండితుని వివాదాల గురించి సీత డైరెక్టర్ దృష్టికి తెచ్చిన గాయత్రిబ్రాహ్మణ సేవాసంఘం. 

Jun 7, 2026 - 23:25
Jun 7, 2026 - 23:46
 0  1
భద్రాచలంలోరామ నారాయణ, ఆస్థాన పండితుని వివాదాల గురించి సీత డైరెక్టర్ దృష్టికి తెచ్చిన గాయత్రిబ్రాహ్మణ సేవాసంఘం. 
భద్రాచలంలోరామ నారాయణ, ఆస్థాన పండితుని వివాదాల గురించి సీత డైరెక్టర్ దృష్టికి తెచ్చిన గాయత్రిబ్రాహ్మణ సేవాసంఘం. 

టెంపుల్ టౌన్ భద్రాచలం, 7జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :-  స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (sita) డైరెక్టర్ డా,, చిలకపాటి. విజయ రాఘవాచార్యులు ఆదివారందివ్య క్షేత్రం భద్రాద్రి శ్రీ సీతారామ చంద్రస్వామివారిని దర్శించి శ్రీ సీతారాముల నిత్య కళ్యాణ మహోత్సవాన్ని కూడా దర్శిం చి అర్చకుల ఆశీస్సులు పొందారు. 

భద్రాచలం వచ్చిన సీత డైరెక్టర్ ను గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు కూడా అయిన రామా వఝల. రవికుమార్ రామాలయంలో, ఐ టి సి బిపిఎల్ గెస్ట్ హౌస్ లో సీతా డైరెక్టర్ విజయ రాఘవాచార్యులను కలసి రామ నారాయణ, గోత్ర ప్రవరల వివాదం మరియు గత మూడున్నర సంవత్సరాలుగా ఆస్థాన పురోహిత పండితుని నియమించకపోవడం మొదలగు విషయాల గురించి, సీత. డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి గత 50 ఏళ్లుగా సీతారాముల కళ్యాణం గురించి త మకు తెలిసిన విషయాలను డైరెక్టర్ గారికి వివరించారు. గతంలో భద్రాచలం రామాలయం ఆస్థాన పురోహిత పండితునిగా బాధ్యతలు నిర్వర్తించిన స్వర్గీయ బ్రహ్మశ్రీ చల్లా. కోదండరామయ్య శర్మ గారి వద్ద సుమారు1980ల వరకు తాను పురోహిత మంత్రపా టాలు నేర్చు కున్నానని, రామాలయంలో నే మంత్ర పాటాలు మాకు చెప్పే వారని, మంత్రాలు నేర్చుకుంటూ గురువుగారితో పాటు తాము కూడా స్వామి కార్యంలో పాల్గొనే వారమని, ఆస్థాన పండితులు గ్రామంలో లేని సమయాల్లో రామాలయంలో గురువుగారి పక్షానపంచాంగ శ్రవణం మేమే చేసేవారమని, స్వామివారి నిత్య కళ్యాణాలలో కూడా గురువుగారి తో ఉండడం వల్ల కళ్యాణ సమయంలో శ్రీరామునిది వశిష్ట గోత్రంగా సీతామాత గోత్రంగౌతమసగోత్రం గా చెప్తూ, సీత దేవి తండ్రి జనక మహారాజు, తాత హ్రస్వ రోమ మహారాజు, ముత్తాత స్వర్ణ రోమ మహారాజు, పేర్లు చెప్పేవారు, శ్రీరామచంద్రుని తండ్రి జనక మహారాజు, తాత అజమహరాజు, ముత్తాత నాభాగ మహారాజు ఈ విధంగా సీతారాముల గోత్ర ప్రవరలు వల్లిస్తూ స్వామివారి కళ్యాణం జరిపించేవారు. 2015 సం,, నుండి పుష్కర పట్టాభిషేకం  పేరుతోనిర్వహించిన సీతారాముల కళ్యాణం లో ఏక పత్నీవ్రతు డైన శ్రీరాముని పేరును బహు భార్యను గల నారాయణునిగా మార్పు చేశారని, ఈ విధానం వల్ల ఆదర్శ దంపతులైన సీతారాములకు అపచారం జరుగుతున్నదని, ఈపొరపాటును సవరించమని గత 16 ఏళ్లుగా అనేకమంది రామ భక్తులు విజ్ఞప్తులు చేస్తున్నా పెడచెవిన పెడుతూ ,,అంతా మా ఇష్టం,, అనే విధంగా వ్యవహరిస్తూ శ్రీరామ భక్తులను మనోవేదనకు గురి చేస్తున్నారని, విజ్ఞులైన మీరుఈ విషయాలపై దృష్టి పెట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి,వశిష్ట సమానమైన ఆస్థాన పండితుని పోస్టు కు భక్త రామదాసు గారి హయాం నుండి ఎంపిక చేస్తున్న విధంగా సమర్ధుడైన వైదిక స్మార్త పురోహితుని నియమించి సీతారాముల నిజమైన గోత్ర ప్రవరలతో స్వామివారి కళ్యాణం జరిపించే విధంగా చర్యలు తీసుకోవాలని సీత డైరెక్టర్ శ్రీమాన్ విజయ రాఘవాచార్యుల వారికి విజ్ఞప్తి చేయడం జరిగిందని రామావఝల తెలిపారు.
సర్వేజనా సుఖినోభవంతు. 

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333