భక్త రామదాసు విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న శ్రీరామ భక్తులు

Apr 12, 2026 - 21:14
Apr 12, 2026 - 21:16
 0  3
భక్త రామదాసు విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న శ్రీరామ భక్తులు
భక్త రామదాసు విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న శ్రీరామ భక్తులు
భక్త రామదాసు విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న శ్రీరామ భక్తులు
భక్త రామదాసు విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న శ్రీరామ భక్తులు

భద్రాచలం రామాలయంలో జరుగుతున్న దైవ అపచారాలు సరిచేయాలని కోరుతూ

 హైదరాబాద్ ట్యాంక్ బండపై ఉన్న భక్త రామదాసు విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న శ్రీరామ భక్తులు.

దైవాపచారాలు జరుగకుండా దైవ ద్రోహులకు సద్బుద్ధిని ప్రసాదించాలని భక్త రామదాసు కి

విజ్ఞాపన పత్రం సమర్పించిన శ్రీరామ భక్తులు.

హైదరాబాద్, 12 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- దైవ ద్రోహులకు సద్బుద్ధిని ప్రసాదించాలని భక్త రామదాసు పాదాల చెంత కూర్చున్న స్థితప్రజ్ఞనంద స్వామీజీ స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి స్వామి వారి ఆధ్వర్యం ట్యాంక్ బండ వద్ద ఉన్న భక్త రామదాసు విగ్రహం వద్ద ఆదివారం శాంతియుతంగా జరిగిన నిరసన కార్యక్రమంలో భక్త రామదాసు విగ్రహం వద్ద శ్రీరామ భక్తులు తమ నిరసనను తెలిపారు. అనంతరం భద్రాచలం రామాలయంలో అపచారం చేస్తున్న వారికి మంచి బుద్ధిని ఇచ్చి దైవ అపచారం జరుగకుండా దైవ ద్రోహులకు మంచి బుద్ధిని ఇవ్వాలని కోరుతూ భక్త రామదాసు విగ్రహానికి విజ్ఞాపన పత్రం సమర్పించారు. ముందుగా భక్త రామదాసు విగ్రహానికి పూలమాల సమర్పించి ధూప, దీప నైవేద్యాలతో అంజలి ఘటించారు.  ప్రముఖ ఉపన్యాసకులు చిదంబర శాస్త్రి, తేజస్వి శర్మ, భక్త రామదాసు వారసులు కంచర్ల, వెంకటరమణ, భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు రామావఝల. రవికుమార్, విశ్వహిందూ రక్షాపరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి యమునా పాటక్, స్వామి దుర్గానందపురి ధర్మాచార్య, స్వామిని పద్మా నంద ధర్మాచార్య, ప్రగతిశీల వీర శైవ సేవ సమాజం తెలంగాణ అధ్యక్షులు  బదరీనాథ్, రామాయణం శర్మ, బి.రామాచార్యులు, ప్రముఖ హైకోర్టు లాయర్ జమలాపురం. శ్రీనివాస్, అడవి, రమేష్, సాధుసంతులు, మహిళా ప్రముఖులు, ఇంకా అనేకమంది శ్రీరామ భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరసన తెలిపిన వక్తలు ప్రసంగిస్తూ, భక్త రామదాసు భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం నిర్మాణం చేసి కొన్ని దుష్టశక్తుల ప్రభావం వల్ల పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు 12 సంవత్సరాలు గోల్కొండలో కారాగార శిక్ష అనుభవించారని, సీతారామచంద్ర స్వామి వారి అనుగ్రహంతో కారాగార శిక్ష నుండి విముక్తి పొంది, భద్రాచలం రామాలయం అన్ని విధాల అభివృద్ధి చెంది భక్తుల  కోర్కెలు తీర్చే విధంగా శ్రీరా ముని అనుగ్రహం భక్తులకు లభించే విధంగా స్వామివారికి అనేక కైంకర్యాలు రూపొందించి భక్తులు శ్రీరామ సేవలో పాల్గొనే విధంగా భక్త రామదాసు గారు కృషి చేశారని. కాగా దశాబ్దం పైగా గత 14 ఏళ్లుగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కైంకర్యాలలో గతంలో వలె అన్ని జరిపించకుండా, అంతా మా ఇష్టం అనే విధంగా కొన్ని దుష్ట శక్తులు పనిచేస్తు న్నాయని,దుష్ట శక్తులను సమర్థి స్తున్న అదృశ్య దుష్టశక్తి ప్రభావంతో చివరికి శ్రీ సీతారాముల కళ్యాణం లో కూడా మహాసాద్వి ప్రతివ్రతాశిరోమణి సీతామాతను వధువుగా పేర్కొంటూ ఏకపత్ని వ్రతుడైన శ్రీరామచంద్రుని పెండ్లి కుమారునిగా అభివర్ణించకుండా బహు భార్యలు గల నారాయణుని పెండ్లి కుమారునిగా చెప్తూ అసత్య గోత్ర ప్రవరలు వల్లిస్తూ ఆదర్శ దంపతులైన సీతారాములకు అపచారం చేస్తున్నారని మనోవ్యధ చెందు తున్న రామ భక్తులు  తమ బాధను వ్యక్తం చేశారు. గత పుష్కర కాలంగా భద్రాచలం రామాలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు కాకపోవడంతో, దైవ ద్రోహులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భక్తుల మనోభావాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వక్తలు తెలిపారు. రామాలయం అభివృద్ధికి, గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు  వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు రామాలయం లో జరుగుతున్న అపచారం విషయంలో వెంటనే స్పందించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్త రామదాసు గారి విగ్రహం వద్ద నుండి లక్షలాది రామ భక్తుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీరామ భక్తులు విజ్ఞప్తి చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333