మోసపూరిత మాటలతో పబ్బం గడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం
భువనగిరి 5 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో 2లక్షల మందికి చేయూత పెన్షన్స్ మంజూరు చేస్తామని,జూన్ 2న కొత్తగా 2లక్షల మందికి పెన్షన్స్ మంజూరు చేస్తామని ప్రకటించి, జూన్ 2న ఎందుకు పెన్షన్స్ మంజూరు చేయలేదని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్.పి.ఆర్.డి)జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ప్రశ్నించారు యాదాద్రి భువనగిరి జిల్లా టౌన్ కేంద్రములో సుందరయ్య భవనంలో జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లపెల్లీ స్వామి జిల్లా కోశాధికారి కొత్త లలిత జిల్లా ఉపధ్యక్షలు చిత్తలూరి శ్రీహరి కలిసి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా వనం ఉపేందర్ మాట్లాడుతూ..2023 డిసెంబర్ నెలలో జరిగిన ప్రజాపాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న 11రకాల చేయూత పెన్షన్స్ కోసం 24.85 లక్షల మంది దరఖాస్తూ చేసుకున్నారని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చి 30నెలలు అవుతుంది.దరఖాస్తులు చేసిన లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరుగుతున్న స్పందించడం లేదు.2026 ఫిబ్రవరి నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కొత్తగా 2లక్షల మందికి చేయూత పెన్షన్స్ జూన్ 2నా మంజూరు చేస్తున్నామని ప్రకటించారు.ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన వలన లక్షలాది మంది చేయూత పెన్షన్స్ కోసం దరఖాస్తులు చేసుకునేందుకు మీ సేవా కార్యాలయల నుండి సర్టిఫికెట్స్ తీసుకుని దరఖాస్తూ చేసుకున్నారు.కానీ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న అమలు చేస్తామని చెప్పిన కొత్త పెన్షన్స్ ఎందుకు మంజూరు చేయలేదు.ముఖ్యమంత్రి, మంత్రులు జిల్లాలో అనేక మీటింగ్లలో జూన్ 2న 2లక్షల మందికి పెన్షన్స్ మంజూరు చేస్తామని ప్రగల్బలు పలికి చేతులు ఎత్తివేయడం ఎంత వరకు సమంజసం.రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తూ పరిపాలన చేయాలనుకోవడం సిగ్గుచేటు.ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కోసం చర్యలు తీసుకోవాలని లేని యెడల ఉద్యమం తప్పధు.రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త పెన్షన్స్ పంపిణి కోసం వెంటనే తేదీని ప్రకటించాలని డిమాండ్ చేస్తుంది.లేని యెడల జిల్లాలో మంత్రుల పర్యటనలను అడ్డుకోవాలని చేయూత లబ్ధిదారులకు పిలుపునిచ్చారు.