భక్తులకు అందుబాటులో శ్రీ వ్యాసరాయ కళ్యాణ మండపం

Aug 8, 2026 - 01:22
 0  2
భక్తులకు అందుబాటులో శ్రీ వ్యాసరాయ కళ్యాణ మండపం

జోగులాంబ గద్వాల 7 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ప్రముఖ పుణ్యక్షేత్రం, నడిగడ్డ భక్తుల ఇలవేల్పు బీచుపల్లి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ సమీపంలో నిర్మించిన కళ్యాణ మండపానికి మరమ్మత్తులు నిర్వహించి శ్రీ వ్యాసరాయ కళ్యాణ మండపముగా తీర్చిదిద్దినట్లు ఈవో పురందర కుమార్ తెలిపారు. ఈనెల 15 నుండి భక్తులకు అందుబాటులో ఉంచి నూతన వివాహాలు జరుపుకోవడానికి కళ్యాణ మండపం అందజేస్తామని ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. అలాగే విజయ రాయ కళ్యాణమండపం కూడా భక్తులకు అందుబాటులో  ఉందని ఈవో తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333