బుల్లెట్ ట్రైన్ సాధన సమితి చేసే ఏ పోరాటానికైనా బిఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుంది

Aug 19, 2026 - 20:02
 0  0
బుల్లెట్ ట్రైన్ సాధన సమితి చేసే ఏ పోరాటానికైనా బిఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుంది

 రైల్వే సాధన సమితి నిరాహార దీక్షలకు మద్దతు పలికిన మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బి ఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు

సూర్యాపేట ప్రజల చిరకాల స్వప్నం కోసం పోరాడుతున్న బుల్లెట్ ట్రైన్ సాధన సమితి చేపట్టే ఏ కార్యక్రమానికైనా బిఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బి ఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు లు అన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం ఆరవ రోజు నిరాహార దీక్షలకు కూర్చున్న ఆర్యవైశ్యులకు బి ఆర్ ఎస్ నాయకులతో కలసి మద్దతు పలికి వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైల్వే మార్గం వస్తే ఈ ప్రాంతమంతా పారిశ్రామికంగా,  సామాజికంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ అలాట్మెంట్ ను మొదట సూర్యాపేటకు కేటాయించి తర్వాత మార్గాన్ని మార్చడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు కలగచేసుకొని కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి సూర్యాపేట జిల్లా కేంద్రానికి 65వ నెంబర్ జాతీయ రహదారికి సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయడంతో పాటు సూర్యాపేటను రైల్వే కారిడర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాగిన విధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఉద్యమం జరుగుతుందని ఏనాటికైనా సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించి తీరుతామన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పూర్తి సహకారం ఉంటుందన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధించేందుకు తనవంతుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చిన తాము ముందు ఉంటామని అన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధించుకునేందుకు ప్రజలంతా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్, మాజీ జెడ్పిటిసి జీడి భిక్షంతో పాటు ఇతర బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333