బీజేపీ విజయ సంకల్పయాత్ర సన్నాహ
విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయడం కోసం
ఖమ్మం జిల్లా బీజేపీ నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్తినేని ధర్మారావు గారు, మాజీ శాసన సభ్యులు, భద్రకాళి - కాకతీయ క్లస్టర్ ఇంచార్జి మాట్లాడుతూ... ఈ నెల 25 నుంచి జిల్లాలో విజయ సంకల్ప యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఇందులో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. గత పదేళ్ళలో ప్రధాని నరేంద్ర మోదీ సాధించిన అభివృద్ధిని, ప్రవేశపెట్టిన కేంద్ర పథకాలను, రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన నిధుల వివరాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ నెల 25 న భద్రాచలంలో యాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ లలో ఏడు రోజులపాటు 21 నియోజకవర్గాల్లో వెయ్యి కిలో మీటర్లు యాత్ర సాగనుందని, ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కలుసుకుంటామని అన్నారు.ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ గారు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్