బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఈటెల రాజేందర్ ⁉️

- రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నాయకుడు
- ఉద్యమ సమయంలో కేసీఆర్ తర్వాత స్థానం
- బీసీ నాయకుడుగా ప్రతిపక్షాలను ధీటుగా పోరాటం
- షార్ట్ లిస్ట్ లో ఈటల రాజేందర్, డీకే అరుణ, రామచంద్రరావు
హైదరాబాద్ న్యూస్ డెస్క్ ; తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక క్లైమాక్స్‌కి చేరుకుంది. రాష్ట్ర బీజేపీకి కొత్త రథసారథి వస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడంతో.. కౌన్ బనేగా తెలంగాణ బీజేపీ చీఫ్…? అంటూ కాషాయ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.. అయితే.. ఇదే కొశ్చన్‌పై గతకొన్ని రోజులుగా పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌హాట్ డిబేట్స్ నడుస్తున్నాయ్. అయితే టీబీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ఆల్ మోస్ట్ క్లైమాక్స్‌కి చేరుకుంది. షార్ట్‌లిస్ట్ సైతం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ముగ్గురు నేతలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. షార్ట్‌లిస్ట్‌లో ఈటల రాజేందర్, డీకే అరుణ, రామచంద్రరావు పేర్లు ఉన్నట్లు సమాచారం..
పార్టీలో మొదట్నుంచి ఉండడం, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుతో.. అధ్యక్ష పదవి కోసం రామచంద్రరావు ప్రయత్నాలు చేస్తున్నారు. సునీల్ బన్సల్, బీఎల్ సంతోష్ సహా ముఖ్యనేతలతో.. ఇప్పటికే అధ్యక్ష పదవి ఆశిస్తున్న నాయకులు సమావేశమయ్యారు.. అయితే.. హైకమాండ్ మహిళా కోటాలో డీకే అరుణ పేరు పరిశీలిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. రెడ్డి సామాజికవర్గ సమీకరణాలు డీకే అరుణకు ప్లస్ పాయింట్స్ గా చెబుతున్నారు.. అయితే.. ముగ్గురిలో రేసులో ఈటల రాజేందర్ ముందున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో బీసీ నినాదం వినిపించేందుకు ఈటల ఆప్షన్ అని.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఈటలకు ప్లస్ పాయింట్ అవుతుందని చెబతున్నారు. అయితే.. షార్ట్ లిస్ట్ లో ఉన్న పేర్లను పరిశీలించిన తర్వాత త్వరలోనే కొత్త అధ్యక్షుడిని మోదీ, అమిత్ షా ఫైనల్ చేయనున్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి ప్లేస్‌లో గతకొన్ని రోజులుగా చాలా పేర్లే వినిపించాయి. ఈటలతో పాటు ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు పేర్లు తెరపైకి వచ్చాయి. కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ఉంటారనే ప్రచారం కూడా జరిగింది. ఐతే అన్నీ తోసిపుచ్చుతూ.. ఇప్పుడు 3 పేర్లను షార్ట్‌లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈటల, డీకే అరుణ, రామచంద్రరావు.. ఈ ముగ్గురిలో ఒకరు అధ్యక్ష బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.