బీచుపల్లి మత్స్యకారులకు పర్యాటకులను రక్షించడానికి
సేఫ్టీ పరికరాలు అందించాలని వినతి పత్రం ఇచ్చిన మత్స్యకారులు.
జోగులాంబ గద్వాల 25 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలం బీచుపల్లి పుణ్యక్షేత్రం బీచుపల్లి కృష్ణానది ఉదృతంగా ప్రవహించే క్రమంలో అనేకమంది పర్యటకులు కృష్ణా నది తీరంలో స్నానాలు ఆచరించడానికి. చనిపోయిన వారి అస్థికల నిమజ్జనానికి, వినాయకుల నిమజ్జనానికి, దుర్గామాతల నిమజ్జనానికి,అలాగే కొంతమంది సూసైడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ప్రమాదవశాత్తు నీటిలో పడడం జరుగుతుంది. అలాంటి సంఘటనలు జరగకుండా పర్యాటకులను ప్రజలను రక్షించడం కొరకై ప్రతినిత్యం మత్స్యకారులు అక్కడ సేవలను అందిస్తూ ఉంటారు. వారికోసం కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా వారికి సేఫ్టీ జాకెట్లు, రిస్కీబోట్, రోప్స్,,వలలు రక్షించడానికి కావాల్సిన సామాగ్రిని సమకూర్చమని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.వాటిని అమలుపరచాలని స్థానిక ఈవో పురేందర్ పంచాయతీ సెక్రెటరీ అరుణ గ్రామ సర్పంచ్ విజిత బిసి రెడ్డికి ఉపసర్పంచ్ నాగరాజు కి మర్యాదపూర్వకంగా నేడు జరిగిన సుచి శుభ్రత గ్రామ అభివృద్ధి సమావేశంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక మత్స్యకారులు అధ్యక్షుడు నర్సింలు ఉపాధ్యక్షుడు రామాంజనేయులు నర్సింహులు పరుష, శివ,మద్దిలేటి, మధు, గోవిందు, రవి లక్ష్మన్న, రాజు, దశరథం జంగం వెంకటేష్ శేఖర్ సింగోటం వెంకటన్న నరసప్ప నాగ నరసింహులు తదితరులు పాల్గొనడం జరిగింది