బీచుపల్లి కృష్ణా నదిలో దూకిన యువతికి ప్రాణదానం

Aug 19, 2026 - 20:10
 0  1
బీచుపల్లి కృష్ణా నదిలో దూకిన యువతికి ప్రాణదానం

గజ ఈతగాళ్లు, ఇటిక్యాల ఎస్సై రవి చొరవతో సురక్షితంగా బయటకు...

 జోగులాంబ గద్వాల 19 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎర్రవల్లి మండలం. బీచుపల్లి కృష్ణా నదిలో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన యువతి కృష్ణా నదిలో దూకింది. విషయం తెలుసుకున్న స్థానిక గజ ఈతగాళ్లు వెంటనే నదిలోకి దిగి యువతిని రక్షించేందుకు ప్రయత్నించారు.  స్థానికులు  ఇటిక్యాల ఎస్సై రవి సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. గజ ఈతగాళ్లు సాహసోపేతంగా నదిలో గాలించి యువతిని గుర్తించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం యువతిని కుటుంబ సభ్యులకు అప్పగించి, ఆమెకు ధైర్యం చెప్పారు. సకాలంలో స్పందించిన గజ ఈతగాళ్లు, ఇటిక్యాల ఎస్సై రవిని స్థానికులు అభినందించారు...  ఎవరికైనా  కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే ఆత్మహత్యకు పాల్పడకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పోలీసులను సంప్రదించాలని పోలీసులు సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333