బిసి నేతపై వేసిన ఫ్లెక్సీలు ఓ దుర్మార్గపు చర్య...

Jun 1, 2026 - 17:13
Jun 1, 2026 - 17:14
 0  2
బిసి నేతపై వేసిన ఫ్లెక్సీలు ఓ దుర్మార్గపు చర్య...

సమాజాన్ని తప్పుద్రోవ పట్టించాలని చూస్తే ఖబడ్దార్.

ఈటల రాజేందర్ ప్రజా నాయకుడు.

ఆయనను ప్రజల నుండి విడదీసే దమ్ము ఎవరికి లేదు.

బీసీ సంఘ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బోళ్ళ కరుణాకర్ ధ్వజం.

సూర్యాపేట, 01 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్ :- తెలంగాణ ఉద్యమ నాయకుడు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు,బీజేపీ రాష్ట్ర ప్రముఖ నాయకులు.ఈటెల రాజేందర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం దుర్మార్గపు చర్య అని బీసీ సంఘ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బోళ్ళ కరుణాకర్ అన్నారు.రాజకీయంలో అవగాహన లేని వ్యక్తులు రాత్రికి రాత్రే దొంగ చాటుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలను తప్పుద్రోవ పట్టించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.ఈ తప్పుడు  చర్యను ఖండిస్తున్నట్లు చెప్పారు.సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘకాలం పాటు శాసన సభ్యులుగా, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్ధిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ప్రజల మద్దతుతో రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగాడని వివరించారు. రాజేందర్ ఎదుగుదలను జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులే ఈ దుర్మార్గపు చర్యకు పాల్బడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.అట్టి వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.త్వరలో జరగనున్న కేంద్ర ప్రభుత్వ మంత్రి వర్గ విస్తరణలో ఈటలకు స్థానం లభించబోతుందని, కావాలనే సొంత పార్టీ నేతలే ఈ చర్యను ప్రోత్సహించి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు. ఆయన జీవితం తెలంగాణ సమాజంలో ఓ తెరిచిన పుస్తకం అని,ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.ఇకనైనా వక్రబుద్ధి బుద్ధి కలిగిన ఓ నాయకులరా మున్ముందు బీసీ బిడ్డలపై నిందారోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ విద్యార్ది సంఘ రాష్ట్ర జేఏసీ చైర్మన్ వీరబోయిన లింగయ్య యాదవ్, బీసీ సంఘ రాష్ట్ర నాయకులు ముద్ద బిక్షపతి యాదవ్,రాష్ట్ర ఉపాధ్యక్షులు బొర్ర విజయ్,జిల్లా నాయకులు పేరాల సాయి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333